విషం కలిపారా : చనిపోవడానికి ముందు కోడెల తిన్న టిఫిన్ ను ల్యాబ్ కి పంపిన పోలీసులు

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కోడెల ఆత్మహత్య మిస్టరీగా మారింది. సూసైడ్ కి కారణాలు తెలియడం లేదు. పైగా

  • Published By: veegamteam ,Published On : September 24, 2019 / 10:36 AM IST
విషం కలిపారా : చనిపోవడానికి ముందు కోడెల తిన్న టిఫిన్ ను ల్యాబ్ కి పంపిన పోలీసులు

Updated On : September 24, 2019 / 10:36 AM IST

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కోడెల ఆత్మహత్య మిస్టరీగా మారింది. సూసైడ్ కి కారణాలు తెలియడం లేదు. పైగా

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కోడెల ఆత్మహత్య మిస్టరీగా మారింది. సూసైడ్ కి కారణాలు తెలియడం లేదు. పైగా కోడెల మృతి కేసు ఏపీలో రాజకీయ రంగు పులుముకుంది. దీంతో పోలీసులు ఈ కేసుని సవాల్ గా తీసుకున్నారు. చనిపోవడానికి ముందు కోడెల తిన్న టిఫిన్ ని పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. టిఫిన్ లో పాయిజన్ ఉందో లేదో తెలిపాలని పోలీసులు కోరారు. ఫోరెనిక్స్ నిపుణులు దీనిపై టెస్టులు జరుపుతున్నారు. ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది.

కోడెల తన చివరి కాల్ గన్ మెన్ ఆదాబ్ కు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో సాంకేతిక, ఫోరెన్సిక్ ఆధారాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 18మంది సాక్షులను విచారించారు. కాగా, కోడెల్ సెల్ ఫోన్ ని కుటుంబసభ్యలు ఇంకా పోలీసులకు ఇవ్వలేదు. వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని పోలీసులు కోడెల కుమారుడు శివరాం, కూతురు విజయలక్ష్మిలను పిలిచారు. 11 రోజుల తర్వాత వస్తామని వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.