Forbes Indiaలో హైదరాబాద్ వాసి

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘ఫోర్బ్స్’ లిస్టులో హైదరాబాద్ వాసికి చోటు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన యానిమేషన్, VFX సంస్థ క్రియేటివ్ మెంటర్స్ అధినేత సురేశ్ రెడ్డిని చోటు సంపాదించుకున్నారు. 13 ఏళ్ల వ్యవధిలోనే ‘ఫోర్బ్స్’ జాబితాలో చేరిన తొలి తెలుగు వ్యాపారవేత్తగా కొవ్వూరి సురేశ్ రెడ్డి ఈ ఘనత సాధించారని కంపెనీ పేర్కొంది. మార్చి నెలాఖరులో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ‘ఫోర్బ్స్’ ఇండియా పత్రికలో డాక్టర్ పి.శ్యామరాజు, రతన్ టాటా, రాహుల్ బజాజ్, హెచ్‌సీఎల్ శివ నాడార్, యదుపాటి సింఘానియా, కుమార మంగళం బిర్లా, హావెల్స్ అనిల్ రాయ్ గుప్తా, మహేంద్ర గ్రూప్స్ ఆనంద్ జి.మహేంద్ర..51 మంది అగ్రగామి వ్యాపారవేత్తల సరసన సురేశ్ నిలిచారు. 30 మంది జాబితాను ఇటీవలే ఫోర్బ్స్ పత్రిక ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో తెలుగు నటుడు ‘విజయ్ దేవరకొండ’కు ప్లేస్ దక్కింది.
వేలాది మంది విద్యార్థులను యానిమేషన్ సంబంధిత రంగాల్లో తీర్చిదిద్దడం, ఇటీవలే ప్రసాద్ ల్యాబ్స్‌లో కలిసి సినీ రంగంలో ప్రవేశించాలని అనుకొనే వారికి శిక్షణనిస్తోంది ఈ సంస్థ. క్రియేటివ్ మెంటర్స్ సంస్థ నగరంలో యువతకు కెరీర్ పరంగా విభిన్న సేవలు అందిస్తోంది. మే 30వ తేదీన లండన్‌లో బీబీసీ సౌజన్యంతో నిర్వహించనున్న ‘గ్లోబల్ బిజినెస్ కాన్‌క్లేవ్ – 2019’ కార్యక్రమంలో భాగంగా హౌస్ ఆఫ్ కామన్స్ అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది. ఈ సంచికలో 51 మంది చోటు సంపాదించుకున్నారు. వీరిని నామినేటెడ్ పర్సన్స్‌గా పరిగణించి, 25 మందికి అవార్డులను ఇవ్వనున్నారు. సురేశ్ రెడ్డికి ఈ పురస్కారం కూడా దక్కితే నగరానికి మరింత గర్వకారణం అవుతుందని క్రియేటివ్ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.