అన్నంలో పురుగులు : ఓయూలో విద్యార్థినుల ధర్నా

హైదరాబాద్ ఓయు లేడీస్ హాస్టల్లో విద్యార్థులు మరోసారి రోడెక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని గతంలో ధర్నాలు..ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓయూ విద్యార్థినులు మార్చి 12వ తేదీ మంగళవారం రాత్రి ధర్నా చేయడం కొంత కలకలం రేపింది.
తమకు వడ్డించే అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థినులు ధర్నాకు దిగారు. అలాగే ఉడికీ ఉడకని భోజనం వల్ల అర్థాకలితో అలమటించాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. మరోపక్క హాస్టళ్లో తరచూ పాములు సంచరిస్తుండడంతో.. భయాందోళనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వీటితోపాటు చీకటి పడితే ఈవ్ టీజర్ల రెచ్చిపోతున్నారని చెప్పారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కారించాలంటూ.. ఓయూలో విద్యార్థినులు రాత్రిపూట ఆందోళనకు దిగారు.