తెలంగాణలో తేలికపాటి వర్షాలు
తెలంగాణలో పలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వావారణ కేంద్రం తెలిపింది.

తెలంగాణలో పలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వావారణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్ : తెలంగాణలో పలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వావారణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమురం భీం, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
ఉత్తర ఇంటీరియర్ కర్నాటక దానిని ఆనుకొని ఉన్న తెలంగాణ ప్రాంతాల్లో 0.9 శాతం కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న కారణంగా మార్చి 22 శుక్రవారం, మార్చి 23 శనివారం పొడి వాతారణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.