100 శాతం బస్సులు నడపాలి : కలెక్టర్లు,ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఈ క్రమంలో కలెక్టర్లు, ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు కలుగకుండా ప్రభుత్వం ప్రైవేటు కార్మికులతో బస్సు సర్వీసులను నడిపిస్తోంది.కానీ డిమాండ్ కు తగినంతగా బస్సులు లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మంత్రి కలెక్టర్లు, ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. త్వరలో వంద శాతం బస్సులు నడిపించాలని సూచించారు.
కాగా..ప్రైవేటు కార్మికులతో బస్సులను నడిపిస్తున్నా బస్సులలో ప్రయాణీకుల వద్ద నుంచి టిక్కెట్ డబ్బులు తీసుకుంటున్నారు కానీ టిక్కెట్స్ ఇవ్వటంలేదు. దీంతో ప్రయాణీకులకు తప్పనిసరిగా టిక్కెట్లు ఇవ్వాలని అన్నారు. అవసరమైతే బస్ డిపోల్లో కొత్తగా మెకానిక్ లను..ఎలక్ట్రిషియన్లను నియమించుకోవాలని సూచించుకోవాలని మంత్రి పువ్వాడ.
కాగా..ఆర్టీసీ కార్మికుల సమ్మెతో దసరా సెలవుల్ని ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. విద్యాసంస్థల పునఃప్రారంభం అనంతరం ట్రాన్స్ పోర్ట్ విషయంలో ఎటువంటి ఇబ్బందిలేదని అధికారులు మంత్రి పువ్వాడకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,228 బస్సులు నడుస్తున్నాయని ఆర్టీసీ అధికారులు మంత్రికి వివరించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె ఇంకా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.