ఇది జస్ట్ శాంపిలే: పాక్ మొత్తాన్ని తగలబెట్టాలి
హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన జరిపిన మెరుపు దాడులపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం

హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన జరిపిన మెరుపు దాడులపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం
హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన జరిపిన మెరుపు దాడులపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఎయిర్ ఫోర్స్ బలగాలు, ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇది కేవలం శాంపిల్ మాత్రమే అన్న రాజాసింగ్.. పాకిస్తాన్ మొత్తాన్ని తగులబెట్టడం మిగిలిందన్నారు. ఆ సమయం కూడా త్వరలో వస్తుందన్నారు. ప్రధాని ఏమీ చేయరని అరుస్తున్న కుక్కలకు ఇది దీటైన జవాబని రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పాక్ ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించి 245మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన వాయుసేనపై ప్రశంసలు కురిపిస్తూ రాజాసింగ్ వీడియో విడుదల చేశారు. పుల్వామా దాడి తర్వాత ప్రతి భారతీయుడు పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకున్నాడని, ఆ కోరిక ఇప్పుడు తీరిందని రాజాసింగ్ అన్నారు. గతంలో, భవిష్యత్‌లో.. ఎప్పుడూ ఇలాంటి దాడి జరగలేదన్నారు. పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల త్యాగం వృథా కానివ్వమన్న మోడీ.. అన్నట్టుగానే ప్రతీకారం తీర్చుకున్నారని రాజాసింగ్ ఆనందం వ్యక్తం చేశారు. పాక్‌కు భారత సైన్యం సరైన రీతిలోనే సమాధానం చెప్పిందని.. సర్జికల్ ఎటాక్‌పై భారత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని రాజాసింగ్ చెప్పారు. పాకిస్తాన్ ఏమైనా దుశ్చర్యకు పాల్పడితే కాశ్మీర్ ఉంటుంది కానీ పాక్ ఉండదని రాజాసింగ్ హెచ్చరించారు.
పుల్వామా దాడికి భారత్ బదులు తీర్చుకుంది. మంగళవారం (ఫిబ్రవరి 26) తెల్లవారుజామున భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాక్ భూభాగంలో మరో సర్జికల్ స్ట్రయిక్స్ చేపట్టాయి. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా గగనతల దాడులకు దిగాయి. దెబ్బకు దెబ్బ తీస్తూ.. ముష్కర మూకల్ని అంతం చేశాయి. ఈ దాడుల్లో ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం అయ్యాయి. 245మంది తీవ్రవాదులు హతమయ్యారు. దాయాది దేశంపై వాయుసేన మెరుపు దాడుల్ని యావత్ భారతం స్వాగతిస్తోంది. పార్టీలకు అతీతంగా నేతలంతా వాయుసేనతో పాటు ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.