స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి ఇచ్చావా.. KCR – జీవన్ రెడ్డి

కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలు తెస్తానంటున్న CM KCR స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి నిధులు కేటాయించావా ? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

  • Published By: madhu ,Published On : April 13, 2019 / 07:34 AM IST
స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి ఇచ్చావా.. KCR – జీవన్ రెడ్డి

Updated On : April 13, 2019 / 7:34 AM IST

కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలు తెస్తానంటున్న CM KCR స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి నిధులు కేటాయించావా ? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలు తెస్తానంటున్న CM KCR స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి నిధులు కేటాయించావా ? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రెవెన్యూ ఆఫీసులు, పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీల్లో లంచం ఇవ్వకుండా పనులు జరిగే విధంగా ఉండాలని..కొత్త చట్టాలు రూపొందించాలని కేసీఆర్ నిర్ణయించడంపై జీవన్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. ఏప్రిల్ 13వ తేదీ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 
Read Also : ఓడిపోతామనే భయంతోనే ప్రేలాపనలు : తలసాని

రాజకీయ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారంటూ విమర్శించారు. అవినీతికి బాటలు వేస్తూ..బాధ్యత అంతా అధికారులపై తోసేస్తే ఎలా ప్రశ్నించారు. రెవెన్యూ రికార్డుల శుద్దీకరణ అంటూ కాలం గడిపారని..వ్యవస్థను అతలాకుతలం కల్లబొల్లి మాటలు చెబుతున్నారని..స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసేది పార్టీలు కాదు..కేసీఆర్ అని తెలిపారు.

స్వర్గీయ రాజీవ్ గాంధీ హాయంలో ఢిల్లీ నుండి గల్లీకి నిధులు సమకూర్చారని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారంటే.. ఆనాటి యూపీఏ కారణమని చెప్పుకొచ్చారు. మండల వ్యవస్థ, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీలు నిర్వీరమయితే.. మున్సిపాల్టీలు అవినీతి కంపు కొడుతున్నాయన్నారు 
Read Also : ఉత్సాహం తగ్గించుకోండి : టిక్ టాక్‌కు ఏజ్ లిమిట్, 60లక్షల వీడియోలు డిలీట్