తెలంగాణ రైతు సమన్వయ సమితి చైర్మన్, డైరెక్టర్‌గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, డైరెక్టర్‌గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు.

  • Published By: veegamteam ,Published On : December 6, 2019 / 10:53 AM IST
తెలంగాణ రైతు సమన్వయ సమితి చైర్మన్, డైరెక్టర్‌గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

Updated On : December 6, 2019 / 10:53 AM IST

తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, డైరెక్టర్‌గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, డైరెక్టర్‌గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి శుక్రవారం (డిసెంబర్6, 2019) ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ మినిస్టర్ హోదా కలిగిన ఈ పదవిలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.

తనను రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమించడంపై హర్షం వ్యక్తం చేస్తూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పల్లాకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర రైతాంగాన్ని ఓ సంఘటిత శక్తిగా మార్చే సత్సంకల్పంతో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు.

రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యులను కూడా త్వరలోనే నియమించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. వచ్చే జూన్ లోపు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమన్వయ సమితిలను బలోపేతం చేసి, రైతులను సంఘటిత శక్తిగా మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. క్లస్టర్ల వారీగా రైతు వేదికల నిర్మాణం కూడా పూర్తి చేయాలని ఆదేశించారు.

విత్తనం వేసిన దగ్గర నుంచి పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులకు అండగా ఉండే విధంగా రైతు సమన్వయ సమితులను పటిష్టమైన పద్ధతుల్లో తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. రైతు సమన్వయ సమితుల బలోపేతం, రైతులను సంఘటిత శక్తిగా మార్చడం, రైతు వేదికల నిర్మాణం, ఇతర రైతు సంబంధ అంశాలపై వ్యవసాయ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.