కూతురిని బస్సు కిందకు తోసేసిన కన్నతల్లి
హైదరాబాద్ కూకట్ పల్లిలో దారుణం జరిగింది. మద్యంమత్తులో ఓ కసాయి తల్లి కన్నకూతురిని బస్ కిందకు తోసేసింది.

హైదరాబాద్ కూకట్ పల్లిలో దారుణం జరిగింది. మద్యంమత్తులో ఓ కసాయి తల్లి కన్నకూతురిని బస్ కిందకు తోసేసింది.
హైదరాబాద్ కూకట్ పల్లిలో దారుణం జరిగింది. మద్యంమత్తులో ఓ కసాయి తల్లి కన్నకూతురిని బస్ కిందకు తోసేసింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న పసిప్రాణం గాలిలో కలిసిపోయేది. అతని అప్రమత్తతో నిండు ప్రాణం నిలబడింది. వెంటనే పాపను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పాప ప్రాణపాయం నుంచి బయటపడింది.
ఈ సంఘటన మాతృత్వానికి మచ్చ తెచ్చేలా ఉంది. ఈ ఉదంతానికి కారణం కన్నతల్లి కావడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. అక్కడున్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు మహిళను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు.
మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనమని చెప్పవచ్చు. మద్యం మత్తులో ఆ మహిళ చేసిన దారుణం అందరినీ కలిచివేస్తోంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ ఈ సంఘటన సభ్య సమాజానికి ఉదాహరణగా నిలుస్తోంది.