పెద్ద కొడుకు కాదు.. పెద్ద తాత: చంద్రబాబుపై మోత్కుపల్లి సెటైర్లు

తెలంగాణలో టీడీపీని చంద్రబాబే భూస్థాపితం చేశారని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.

  • Published By: vamsi ,Published On : March 30, 2019 / 02:51 AM IST
పెద్ద కొడుకు కాదు.. పెద్ద తాత: చంద్రబాబుపై మోత్కుపల్లి సెటైర్లు

Updated On : March 30, 2019 / 2:51 AM IST

తెలంగాణలో టీడీపీని చంద్రబాబే భూస్థాపితం చేశారని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.

తెలంగాణలో టీడీపీని చంద్రబాబే భూస్థాపితం చేశారని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. చంద్రబాబుని నమ్ముకున్న తెలంగాణ నేతలు అందరూ ఇప్పుడు ఏకాకులు అయ్యారని మోత్కుపల్లి ఆరోపించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసిన చంద్రబాబు.. ఏపీ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మోత్కుపల్లి మండిపడ్డారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు.
Read Also : గుడ్ న్యూస్ : పెద్దమ్మగుడి వద్ద మెట్రో ఆగుతుంది

తెలంగాణ గడ్డపై పురుడు పోసుకున్న టీడీపీని చంద్రబాబు మోసపూరిత వెన్నుపోటు విధానాలతో భూస్థాపితం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని పారిపోయిన చంద్రబాబు.. టీడీపీ పార్టీ ఉనికిని లేకుండా చేశాడంటూ మండిపడ్డారు. ఇంటికి పెద్దకొడుకునంటూ ఓట్లకోసం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని, 70ఏళ్ల చంద్రబాబు పెద్ద కొడుకు కాదని, పెద్ద తాత అవుతాడంటూ సెటైర్ వేశారు. కాళ్లు మొక్కి గాంధీని చంపిన గాడ్సే కంటే నీతి మాలిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. పార్టీ పేరు చెప్పుకొని చంద్రబాబు అధికారం అనుభవిస్తున్నారని, పేదల కోసం ఎన్టీఆర్ పెట్టిన టీడీపీని చంద్రబాబు దొడ్డిదారిలో లాక్కున్నారని అన్నారు.
Read Also : నన్ను గెలిపిస్తే : పాతబస్తీని మార్చేస్తా