హుజూర్‌నగర్‌ ఓటమికి నాదే బాధ్యత : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హుజూర్‌నగర్‌ ఓటమికి తనదే బాధ్యతని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

  • Published By: veegamteam ,Published On : October 29, 2019 / 02:03 PM IST
హుజూర్‌నగర్‌ ఓటమికి నాదే బాధ్యత : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Updated On : October 29, 2019 / 2:03 PM IST

హుజూర్‌నగర్‌ ఓటమికి తనదే బాధ్యతని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

హుజూర్‌నగర్‌ ఓటమికి తనదే బాధ్యతని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అధికార పార్టీ యంత్రాంగం బలంగా పనిచేసిందని.. అయినా 70 వేల ఓట్లు సాధించామన్నారు. కోర్‌ కమిటీలో హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక, ప్రగతిభవన్‌ ముట్టడిపై కాంగ్రెస్‌ నేతలు చర్చించారు. 

కాంగ్రెస్‌ పార్టీలో క్రమశిక్షణ తప్పిందని సీనియర్‌ నేత వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరినీ సంప్రదించకుండా ప్రగతి భవన్‌ను ముట్టడించడాన్ని వీహెచ్‌ తప్పుపట్టారు. రేవంత్‌రెడ్డిపై పరోక్షంగా ఫిర్యాదు చేశారు వీహెచ్‌. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు.