మళ్లీ మళ్లీ TRSదే అధికారం : నేనే సీఎంగా ఉంటా – కేసీఆర్

  • Published By: madhu ,Published On : September 15, 2019 / 10:37 AM IST
మళ్లీ మళ్లీ TRSదే అధికారం : నేనే సీఎంగా ఉంటా – కేసీఆర్

Updated On : September 15, 2019 / 10:37 AM IST

వచ్చే మూడు టర్మ్‌లు తెలంగాణ రాష్ట్రంలో TRSదే అధికారం అన్నారు సీఎం కేసీఆర్. ఇది ఎవరూ ఆపలేరని ఖరాఖండిగా చెప్పారు. కేసీఆర్ దిగిపోతడు..కేటీఆర్ అవుతారని ప్రచారం చేశారని తెలిపారు. సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ బడ్జెట్‌పై సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు. అందులో భాగంగా తనపై, టీఆర్ఎస్‌పై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. 

కేసీఆర్ ఆరోగ్యం ఖతమైందంట..అమెరికా పోతడంట..చచ్చిపోయి 20 ఏళ్లు అయ్యింది..కేసీఆర్ దిగిపోయి..కేటీఆర్..చేస్తారంట..అనే ప్రచారం జరిగిందన్నారు. తన వయస్సు ఇప్పుడు 66 అని..ఇంకా పదేళ్లు చేయనా అని చెప్పారు. ఈ టర్మ్ నేనే ఉంటా..వచ్చే టర్మ్ నేనే ఉంటానని చెప్పారు. శాపాలు పెట్టినా గట్టిగానే ఉంటా..ప్రజల దీవెన..దేవుడి దయ..ఉంటాయన్నారు. ప్రజల కోసం తిప్పలు పడుతున్నాం..ఇంకా పడుతాం..వందకు వంద శాతం టీఆర్ఎస్‌దే అధికారమని స్పష్టం చేశారు. 

నీళ్ల విషయానికి వచ్చినప్పుడు..ఇంటి గుట్టు బయట పెట్టుకోవద్దని సూచించారు. సీతారామ, దేవాదుల, కాళేశ్వరం 570 టీఎంసీల నీళ్లు తెలంగాణ రాష్ట్రం తీసుకుంటుందని ఖరాఖండిగా చెప్పారు. అక్టోబర్‌లో నీళ్లు తీసుకుంటామన్నారు. అనసరమైన రాద్దాంతాలు చేయవద్దని, నిర్మాయాత్మకమైన, సలహాలతో కూడిన విమర్ళలు ఉంటే స్వీకరిస్తామని ప్రతిపక్షాలకు సూచించారు సీఎం కేసీఆర్.