హైదరాబాద్ అలర్ట్ : ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు బ్రేక్

హైదరాబాద్ : నగర వాసులకు నీటి సరఫరాలో అంతరాయం కలుగనుంది. గోదావరి ప్రాజెక్టులో 1800 ఎంఎం డయా పైపులైన్ నిర్వాహణ పనులు జరుగుతుండడమే ఇందుకు కారణం. ఫిబ్రవరి 15 (శుక్రవారం), ఫిబ్రవరి 16 (శనివారం) రోజుల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి ప్రకటించింది. 15వ తేదీ శుక్రవారం మాత్రం పూర్తిగా సరఫరా ఉండదని.. ఫిబ్రవరి 16 శనివారం రోజు నీటి సరఫరా ఆలస్యం కానున్నట్లు తెలిపింది.
ఈ ప్రాంతాల్లోనే బ్రేక్ :
ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, వెంకటగిరి, అమీర్ పేట, ఎస్ఆర్ నగర్, సోమాజీగూడ, యూసఫ్ గూడ, వెంగళరావునగర్, ఎల్లారెడ్డిగూడ, బంజారాహిల్స్, బోరబండ, కూకట్ పల్లి, KPHB, భాగ్యనగర్, బాలాజీనగర్, గాయిత్రినగర్, ఎస్‌పీఆర్ హిల్స్, ఎల్లమ్మ బండ, జగద్గిరిగుట్ట, ఆదర్శనగర్, షాపూర్ నగర్, చింతల్, హఫీజ్ పేట, మయూరీనగర్, గోపాల్ నగర్ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఉండనుంది. ప్రజలు ఈ విషయాన్ని గమనించి.. అత్యవసరం అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది జలమండలి.