ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం : హైదరాబాద్ లో సరి-బేసి విధానం
హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. రోజురోజుకి ట్రాఫిక్ పెరిగిపోతోంది. నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో వాహనదారులు నరకం చూస్తున్నారు.

హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. రోజురోజుకి ట్రాఫిక్ పెరిగిపోతోంది. నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో వాహనదారులు నరకం చూస్తున్నారు.
హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. రోజురోజుకి ట్రాఫిక్ పెరిగిపోతోంది. నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై ఫోకస్ పెట్టారు. ఐటీ కారిడార్ లో పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు వాహనాల సరి- బేసి విధానం అమలు చేయాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు.
ఢిల్లీ తరహాలో ఇక్కడా సరి, బేసి విధానంలో వాహనాలను అనుమతించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని యోచిస్తున్నారు. అదే సమయంలో కోకాపేటలో భారీ నిర్మాణాలను నియంత్రించేందుకు బహుళ అంతస్తుల నిర్మాణాలపై ఇంపాక్ట్ ఫీజు పెంపుపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఐటీ కారిడార్ పరిధిలో కొత్తగా వస్తున్న నిర్మాణాలు, పెట్టుబడులు, కంపెనీలు, వాహన రద్దీ, కాలుష్యం అంశాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో తలెత్తే ముప్పును నియంత్రించేందుకు పలు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఈ అంశంపై 100 మంది ఐటీ కంపెనీల ప్రతినిధులతో బుధవారం(సెప్టెంబర్ 04,2019) అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఐటీ, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, టీఎస్ఐఐసీ, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఐటీ ప్రతినిధులు, అధికారులు చేసిన ప్రతిపాదనలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కార్ పూలింగ్ ని ప్రోత్సహించాలన్న ప్రతిపాదనపై సమావేశంలో భిన్నాభిప్రాయలు వచ్చాయి. కొందరు సపోర్ట్ చేస్తే కొందరు వ్యతిరేకించారు. కార్ పూలింగ్ అంటే కార్లు ఎక్కువవుతాయని చెప్పారు. ఈ ప్రతిపాదన అమలు చేస్తూనే ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచితే పరిస్థితి మెరుగవుతుందని తెలిపారు. ఐటీ కారిడార్ విస్తరిస్తున్న కోకాపేట రూట్ లో భవిష్యత్తులో సమస్యను కొంతవరకైనా నియంత్రించేందుకు నిర్మాణాలపై ఇంపాక్ట్ ఫీజు పెంచాలన్న ప్రతిపాదన వచ్చింది. పరిస్థితులను అధ్యయనం చేసి ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఆర్టీసీ సేవలు విస్తృతంగా అందుబాటులో లేకపోవడంతో ఉద్యోగులు ప్రైవేటు వాహనాలు, క్యాబ్ లను ఆశ్రయిస్తున్నారని ఐటీ కంపెనీల ప్రతినిధులు ప్రస్తావించారు.
రహేజా పార్కు-రాయదుర్గం, బయోడైవర్సిటీ పార్కు-ఐకియా మార్గంలో కార్ల రద్దీ ఎక్కువగా ఉంది. రాయదుర్గం పరిధిలో పలు సంస్థలు కొత్త నిర్మాణాలు ప్రారంభించాయి. ఈ మార్గాల్లో రద్దీ తగ్గించేందుకు కార్ పూలింగ్ విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. మాదాపూర్, హైటెక్ సిటీ మార్గంలో ఆర్టీసీ సేవల్ని మరింత విస్తృతం చేయాలని సూచించారు. ప్రైవేటు పార్కింగ్ స్థలాల్లో ఫీజును పెంచాలని సలహా ఇచ్చారు. ఢిల్లీలో పార్కింగ్ లాట్ ఫీజు రూ.5 వేలుగా ఉంది. ఇక్కడా ఈ విధానం తీసుకొస్తే కొంత వరకైనా కార్ల రద్దీ తగ్గించొచ్చని యోచిస్తున్నారు. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు నుంచి విప్రో సర్కిల్ వరకు బీఆర్ టీఎస్ మార్గాన్ని వేగంగా పూర్తిచేయాల్సి ఉంది. దాంతో ఈ మార్గంలో ప్రజారవాణా పెరిగి, ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని భావిస్తున్నారు.