నాంపల్లిలో కూలిన పురాతన భవనం

  • Published By: chvmurthy ,Published On : October 19, 2019 / 12:36 PM IST
నాంపల్లిలో కూలిన పురాతన భవనం

Updated On : October 19, 2019 / 12:36 PM IST

హైదరాబాద్ లో ఓ పురాతన భవనం కూలి  పలువురికి గాయాలయ్యాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న  మొఘల్ షరాఫ్  అనే పురాతన చారిత్రక భవనం  శనివారం సాయంత్రం కుప్పకూలిపోయింది.

భవనం శిధిలావస్ధకు చేరుకోవటంతో ఆ భవనంలో కొందరు యాచకులు తలదాచుకుంటున్నారు.  పలువురు యాచకులు శిధిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.