సోషల్ మీడియా పుణ్యమా అని : 24గంటల్లో రూ.89లక్షల ట్రాఫిక్ చలాన్లు చెల్లింపు
రోడ్లపై సురక్షితమైన ప్రయాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టాన్ని సవరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమల్లో ఉన్న వాహన చట్టంలో భారీ మార్పులు

రోడ్లపై సురక్షితమైన ప్రయాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టాన్ని సవరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమల్లో ఉన్న వాహన చట్టంలో భారీ మార్పులు
రోడ్లపై సురక్షితమైన ప్రయాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టాన్ని సవరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమల్లో ఉన్న వాహన చట్టంలో భారీ మార్పులు చేసింది. 2019, సెప్టెంబర్ 1 నుంచి సరికొత్త చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త చట్టం ప్రకారం వాహనదారులకు విధించే జరిమానాల మొత్తాన్ని భారీగా పెంచేశారు. ఈ కొత్త చట్టం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఆ రేంజ్ లో ఫైన్లు పెంచారు.
కొత్త చట్టం ఎఫెక్ట్ బాగానే కనిపించింది. సోషల్ మీడియా పుణ్యమా అని హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ చలాన్లు చెల్లించారు. పాత చలాన్లకు కొత్త జరిమానా వర్తిస్తుందని.. సోషల్ మీడియాలో తప్పుడు వార్తల ప్రచారం జరిగింది. ఇది నిజమే అనుకుని చలానుదార్లు ఆందోళన చెందారు. ఆలస్యమైతే ఎక్కడ ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందోనని భయపడ్డారు. పెండింగ్ చలాన్లు కట్టేందుకు ఎగబడ్డారు. దీంతో శనివారం(ఆగస్టు 31,2019) ఒక్క రోజే ట్రాఫిక్ చలాన్ల రూపంలో రూ.89లక్షలు మొత్తం వచ్చింది. భారీ మొత్తంలో చలాన్లు కట్టడంతో ఖజానాకి మంచి ఆదాయం వచ్చింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు, ప్రభుత్వ అధికారులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. పాత చలాన్లకు కొత్త జరిమానా వర్తిస్తుందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. ఇది నిజం కాదని ఏకంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్టేట్ మెంట్ ఇచ్చారు. అయినా ఇది నిజమే అనుకుని భయపడ్డ వాహనదారులు చలాన్లు కట్టేందుకు క్యూ కట్టారు. ఏది ఏమైనా అంతా మంచే జరిగిందని అధికారులు ఆనందిస్తున్నారు.
కొత్త చట్టం ప్రకారం జరిమానాలు ఇవే:
* హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే… కొత్త చట్టం మేరకు రూ.1000 (ప్రస్తుతం రూ.100) లేదా 3 నెలల పాటు లైసెన్సు రద్దు.
* మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు (ప్రస్తుతం రూ.2 వేలు)
* సీటు బెల్టు పెట్టుకోకుండా కారు నడిపితే రూ.వెయ్యి (ప్రస్తుతం రూ.100)
* డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.500)
* రాంగ్ రూట్‌లో వాహనం నడిపితే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.1100)
* అతివేగంతో వాహనం నడిపితే రూ.1000 లేదా రూ.2 వేలు (ప్రస్తుతం రూ.400)
* ప్రమాదకరంగా వాహనం నడిపితే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.1000)
* అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10 వేలు (ప్రస్తుతం ఎలాంటి అపరాధం లేదు)
* వాహనానికి బీమా లేకపోతే రూ.2 వేలు (ప్రస్తుతం రూ.1000)
* పర్మిట్ లేని వాహనానికి రూ.10 వేలు (ప్రస్తుతం రూ.5000)
* త్రిపుల్ డ్రైవింగ్ చేస్తే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.1200)
* సెల్‍ఫోన్ డ్రైవింగ్ చేస్తే రూ.5 వేలు (రూ.వెయ్యి)
* మైనర్లు డ్రైవింగ్ చేస్తే రూ.25 వేలు లేదా సంరక్షకులు లేదా యజమానికి మూడేళ్ల జైలు, ఫైన్. (ప్రస్తుతం రూ.1500 మాత్రమే వసూలు చేస్తున్నారు.)
Also Read : రోడ్డుపై బైక్ డాన్స్ లేస్తే…జీతాలు, ఆస్తులు అమ్ముకోవాలి