సిగ్నల్ ఫ్రీ సిటీ గా రూపొందిస్తున్నాం: మహమూద్ ఆలీ

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ను సిగ్నల్ ఫ్రీ సిటీగా రూపోందించేందుకు కృషిచేస్తున్నామని హోం మంత్రి మహముద్ ఆలీ చెప్పారు. ఎల్ బీ నగర్ లో 42 కోట్ల రూపాయలతో నిర్మించిన ఫ్లై ఓవర్ ను మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మల్లారెడ్డి, మేయర్ రామ్మోహన్ తో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో ఎక్కడా ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేలా సీఎం కేసీఆర్, మాజీ మంత్రికేటీఆర్ ప్రణాళికలు రూపోందించారని పేర్కోన్నారు. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం వలన విజయవాడ వెళ్లే వాహనాలకు ఎటువంటి ట్రాఫిక్ లేకుండా ఉంటుందని అన్నారు. నగరంలో పలు జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్యను పరిష్కరించటానికి ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నామని, అందులో భాగంగా మలక్ పేట వద్ద త్వరలో ఫ్లైఓవర్ పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
ఎల్‌బీనగర్ ఫ్లై ఓవర్ వివరాలు
పొడవు : 780 మీటర్లు
వెడల్పు : 12 మీటర్లు
స్టాండర్డ్ స్పాన్స్ : 270 మీ.
ఆబ్లిగేటరీ స్పాన్ : 110 మీ.
ర్యాంపుల పొడవు : 400 మీ. (విజయవాడ వైపు 213 మీ, హైదరాబాద్ వైపు 187 మీ)
క్యారేజ్ వే : 11 మీ. 3 లేన్లు, వన్‌వే
ఎంఎస్ హ్యాండ్ రెయిలింగ్, ఎల్‌ఈడీ లైటింగ్, యాంటీ కార్పొనేట్ పెయింటింగ్స్
అంచనా వ్యయం : 42 కోట్ల రూపాయలు