రైల్వే కేసుల ఉపసంహరణ : ఉద్యమ సమయంలో ధర్నాలు

హైదరాబాద్: తెలంగాణా ఉద్యమ సమయంలో నమోదైన రైల్వే కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోరూతూ సీఎం కేసీఆర్ తో సహా పలువురు నాయకులు ఉద్యమ సమయంలో రైల్ రోకోలు, రైలు పట్టాలపై నిరసనలు తెలుపుతూ ధర్నాలు నిర్వహించారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, ఈటల, కోదండరాం, నాయిని, జగదీశ్ రెడ్డి, దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు, స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్, విఠల్, వివేక్ లపై సికింద్రాబాద్ , వికారాబాద్ , మంచిర్యాల రైల్వే పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలైనందున, అప్పుడు నమోదైన కేసులను ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాసనసభ ఎన్నికలకు ముందే కేసులు ఉపసంహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఉత్తర్వులు నిలిచిపోయాయి. తాజాగా ఈ కేసులను ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.