Weather Update : హైదరాబాద్‌కు వర్ష సూచన

  • Published By: madhu ,Published On : November 3, 2019 / 03:23 PM IST
Weather Update : హైదరాబాద్‌కు వర్ష సూచన

Updated On : November 3, 2019 / 3:23 PM IST

క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాజధాని హైదరాబాద్‌లో రానున్న 36 గంటల్లో వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు  తెలిపింది. ఇదిలా ఉంటే..హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి నమోదవుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత 31.2 డిగ్రీలుగా నమోదు కాగా.. కనిష్ట ఉష్ణోగ్రత 22.5 డిగ్రీల సెల్సియస్ రికార్డైంది. గాలిలో తేమ 55 శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నవంబర్ 4వ తేదీ సోమవారం ఉత్తర అండమాన్‌ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి వచ్చే రెండు మూడు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారవచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
Read More : అందుబాటులోకి మరో ఫ్లైఓవర్ : గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధం