హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ : హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, అమీర్ పేట్, పంజాగుట్ట, రామంతపూర్, ఉప్పల్, నాచారం, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, కోఠి, నారాయణగూడ, బాగ్ లింగంపల్లి, చిక్కడపల్లి, ఆర్టీసీక్రాస్ రోడ్డుతోపాటు పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఉరుము, మెరుపులతో కూడిన వాన కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ అయింది.