KPHB కాలనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి హత్య

కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలోని 7th ఫేస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి సతీష్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇతను ప్రకాశం జిల్లా మార్టూరుకి చెందిన వాడు. మూసాపేటలో నివాసం ఉంటూ సొల్యూషన్స్ అనే కంపెనీని స్థాపించాడు. ఇందులో హేమంత్ పార్ట్ నర్. కానీ..ఆగస్టు 29వ తేదీ గురువారం సతీష్..ఇంటికి రాకపోవడంతో భార్య కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కానీ..హేమంత్ ఇంటి నుండి దుర్వాసన వస్తుందని పక్కింటి వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహం సతీష్‌దని నిర్ధారించారు. డెడ్ బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్య జరిగిందని, హేమంతే నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.