కిరాతకంగా చంపుకుంది : సాఫ్ట్ వేర్ యువతి ఆత్మహత్య

  • Published By: veegamteam ,Published On : February 16, 2019 / 09:53 AM IST
కిరాతకంగా చంపుకుంది : సాఫ్ట్ వేర్ యువతి ఆత్మహత్య

హైదరాబాద్ సిటీ మాదాపూర్ లో కలకలం. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకుంది. అరుణోదయ కాలనీలోని లేడీస్ హాస్టల్ లో ఉంటున్న శ్రీవిద్య  బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని.. ఊపిరి ఆడకుండా చేసుకుంది. అత్యంత దారుణంగా ప్రాణాలు తీసుకోవటం షాక్ కు గురిచేసింది. సహజంగా అయితే ఫ్యాన్ కు ఉరివేసుకోవటం, నీళ్లలో దూకి, విషం తాగి, బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోతుంటారు. అందుకు భిన్నంగా.. శ్రీవిద్య కిరాతంగా ప్రాణాలు తీసుకోవటం చర్చనీయాంశం అయ్యింది.

 

2019, ఫిబ్రవరి 10వ తేదీనే శ్రీవిద్య హాస్టల్ లో జాయిన్ అయ్యింది. 15వ తేదీ రాత్రి నుంచి శ్రీవిద్య హాస్టల్ లోని తన గది నుంచి బయటకు రాలేదు. తలుపు తీయలేదు. ఆ గదిలో సింగిల్ గా ఉంటోంది. ఉదయం కూడా తలుపు తీయకపోవటంతో అనుమానం వచ్చిన హాస్టల్ యాజమాన్యం.. పోలీసులకు ఫోన్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని ఉంది. అప్పటికే చనిపోయి కొన్ని గంటలు అయ్యింది పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు చేసుకున్నట్లు గుర్తించారు.

 

శ్రీవిద్య తల్లిదండ్రులకు సమాచారం అందించి..మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వ్యవహారమా లేక ఆఫీస్ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు.