IT ఉద్యోగులకు గుడ్ న్యూస్ : దీపావళికి రాయదుర్గం మెట్రో స్టేషన్

  • Published By: madhu ,Published On : September 18, 2019 / 04:10 AM IST
IT ఉద్యోగులకు గుడ్ న్యూస్ : దీపావళికి రాయదుర్గం మెట్రో స్టేషన్

Updated On : September 18, 2019 / 4:10 AM IST

రాయదుర్గం మెట్రో స్టేషన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అక్టోబర్ 15వ తేదీ వరకు మిగిలిన పనులు పూర్తి చేసి నెలాఖరు వరకు ప్రయాణీకులకు అందుబాటులోకి తెస్తామని మెట్రో అధికారులు వెల్లడిస్తున్నారు. దీపావళి నాటికి ప్రారంభిస్తామంటున్నారు. మెట్రో రైలు తొలి దశ ప్రాజెక్టులో నాగోల్ టు రాయదుర్గం వరకు కారిడార్ -3 అత్యంత కీలకమని చెప్పవచ్చు. ఐటీ కారిడార్‌లో లక్షలాది మంది పని చేస్తుంటారు. వీరికి సరియైన ప్రజా రవాణా లేదు. మెట్రో అందుబాటులోకి వస్తే..చాలా మేలు జరుగుతుంది. ప్రస్తుతం హైటెక్ సిటీ వరకు మెట్రో పరుగులు తీస్తోంది. కేవలం కిలోమీటర్ దూరంలో మైండ్ స్పేస్ వద్ద రాయదుర్గం మెట్రో స్టేషన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ అండర్ పాస్, ఫ్లై ఓవర్ల నిర్మాణం వల్ల పనులు పెండింగ్‌లో పడుతూ వచ్చాయి. 

హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు ట్రాక్, విద్యుత్ పనులు పూర్తి చేశారు. ఓవర్ హెడ్ ట్రాక్షన్ లైన్లకు సెంట్రల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్‌పెక్టర్ తనిఖీలు ఇప్పటికే పూర్తయ్యాయి. మెట్ల మార్గాలు చివరి దశలో ఉన్నాయి. నెల రోజుల్లో మిగతా పనులన్నీ పూర్తి చేయాలని మెట్రో అధికారులు భావిస్తున్నారు. తుది అనుమతుల అనంతరం అక్టోబర్ నెలాఖరులోపే రాయదుర్గం స్టేషన్‌ను అందుబాటులోకి తేవాలనే టార్గెట్ పెట్టుకుంది ఎల్ అండ్ టీ. 

సో..మెట్రో రైలు అందుబాటులోకి వస్తే..ఉద్యోగుల కష్టాలు తీరనున్నాయి. కిలోమీటర్ దూరానికి చాలా సమయం పడుతోంది. హైటెక్ సిటీ వరకు 40 నిమిషాల్లో వస్తే..ఈ ప్రాంతంలో అరగంట పాటు ట్రాఫిక్‌లో చిక్కుకపోతున్నారు. దీంతో చాలా సమయం వృదా అవుతోంది. మైండ్ స్పేస్ వరకు మెట్రో ప్రారంభమయితే..రెండు..మూడు నిమిషాల్లో రాయదుర్గం చేరుకుంటారు. 
Read More : వాహనదారులకు బ్యాడ్ న్యూస్ : పెరగనున్న పెట్రోల్, డీజిల్