హైటెక్ సిటీలో హైటెక్ వ్యభిచారం

ఐటీ కంపెనీలకు నెలవుగా ఉన్న హైటెక్ సిటీలో హైటెక్ వ్యభిచారం ముఠా గుట్టురట్టు కావడం సంచలనం సృష్టించింది. SOT పోలీసుల బృందం హోటళ్లపై మెరుపు దాడి చేసింది. విదేశాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో సోదాలు జరిపారు. కొంతమంది విటులు, పది మందికి పైగా యువతులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
దాడులు జరుగుతుండగానే కొంతమంది పరారయ్యారని తెలుస్తోంది. నిర్వాహకుల నుంచి నగదు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం వారిని విచారిస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను టార్గెట్ చేసుకుని..వారిని ఆకర్షించి యువతులను ఎరవేస్తున్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న ఇతర హోటళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు.
హైటెక్ సిటీలో చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి..ఇక్కడ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. స్థానికంగా ఉండే అపార్ట్ మెంట్‌లలో నివాసం ఉంటున్నారు. వేరే ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చే వారి సంఖ్య ఇక్కడ ఎక్కువగానే ఉంటుంది. యువకుల బలహీనతలు, విలాసవంతమైన జీవితం కోరుకునే యువతులను నిర్వాహకలు ట్రాప్ చేస్తున్నారు. మాయమాటలతో ప్రలోభ పెట్టి వారి చేత వ్యభిచారం చేయిస్తున్నారు. వ్యభిచార నిర్వాహకులు మధ్యవర్తుల ద్వారా విచ్చలవిడిగా విటులను రప్పిస్తూ..యువతుల జీవితాలతో ఆటాడుకుంటున్నారు.