టీఎస్ ఆర్టీసీ కార్మికులకు అందని జీతాలు

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఇంకా జీతాలు అందుకోలేదు. ఖాతాల్లో డబ్బులు పడకపోవడంపై కార్మికులు చర్చించుకుంటున్నారు. ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ప్రతి నెలా ఒకట తేదీనే వేతనాలు అందుతుంటాయి. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా జీతాలు చెల్లించలేకపోయింది. అక్టోబర్ 05వ తేదీన వీరు వేతనాలు అందుకోనున్నారు. అంతేగాకుండా కార్మికులు సమ్మె బాట పట్టడం..వేతనాల్లో జాప్యం కావడంతో ఉత్కంఠ నెలకొంది. పండుగ వేళ జాతాలు రాకపోవడంతో కార్మిక కుటుంబాల్లో ఆందోళ నెలకొంది.
డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టారు ఆర్టీసీ కార్మికులు. సాయంత్రం 6 గంటల్లోపు విధులకు హాజరు కాకపోతే వారిని ఉద్యోగులుగా గుర్తించమని ప్రభుత్వం లాస్ట్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జీతాలు పడుతాయో లేదోనన్న టెన్షన్ వారిలో నెలకొంది. ఓ వైపు హెచ్చరిస్తూనే…మరోవైపు తాత్కాలిక నియామకాలను వేగవంతం చేసింది ప్రభుత్వం. పెద్ద ఎత్తున ప్రైవేటు బస్సులను సేకరిస్తోంది. పోలీసుల భద్రతతో బస్సులను నడిపే ప్రయత్నం చేస్తోంది.
అక్టోబర్ 06వ తేదీ శనివారం డిపోల్లో ఉన్న అన్నీ బస్సులను రోడ్లపైకి తీసుకరావాలని భావిస్తోంది ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం. అయితే..తాము సమ్మె విరమించే ప్రసక్తే లేదని కార్మిక సంఘాలు తేల్చిచెబుతున్నాయి. అక్టోబర్ 05వ తేదీ శనివారం రోజు..9 వేల బస్సులను నడిపామని ఆర్టీసీ చెబుతోంది. అందులో ఆర్టీసీ బస్సులు 2 వేల 129, అద్దె బస్సులు వేయి 717, ప్రైవేటు బస్సులు వేయి 155, కాలేజీ బస్సులు వేయి 195, మ్యాక్సీ క్యాబ్, ఇతర వాహనాలు 2 వేల 778 తిప్పినట్లు వెల్లడించింది. తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలు చేపట్టింది. ఇప్పటి వరకు 6 వేల మందిని నియమించింది. 4 వేల మంది డ్రైవర్లు, 2 వేల మంది కండక్టర్లు ఉన్నారు.
Read More : డెడ్ లైన్ బేఖాతర్ – విధుల్లో చేరని ఆర్టీసీ కార్మికులు – కొత్త నియామకాలకు సన్నాహాలు