అఖిపక్షం ధర్నాలో కాంగ్రెస్ కొట్లాట : వీహెచ్ పై చేయిచేసుకున్న నగేశ్

  • Published By: madhu ,Published On : May 11, 2019 / 06:45 AM IST
అఖిపక్షం ధర్నాలో కాంగ్రెస్ కొట్లాట : వీహెచ్ పై చేయిచేసుకున్న నగేశ్

Updated On : May 11, 2019 / 6:45 AM IST

కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అఖిలపక్షం ధర్నా సాక్షిగా ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. ఇంటర్ బోర్డు వైఖరికి నిరసనగా, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సంతాపంగా తెలంగాణలోని అఖిలపక్షం ఆధ్వర్యంలో మే 11వ తేదీ శనివారం ఉదయం ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేపట్టారు. అన్ని పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

వేదికపై ముందు వరసలో కూర్చునే విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ – మరో నేత గజ్జెల నగేశ్ మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మాటమాట పెరిగింది. ఈ సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ పై చేయిచేసుకున్నారు నగేశ్. ఆవేశంతో ఆయనపైకి వెళ్లారు. నెట్టేశారు. వీహెచ్ కింద పడిపోతుంటే వెనక ఉన్న నేతలు పట్టుకున్నారు. ఆ తర్వాత నగేశ్ పై చేయిచేసుకున్నారు వీహెచ్. వేదిక పైనుంచి నెట్టివేశారు. ఇద్దరూ తిట్టుకున్నారు. పార్టీ నేతలు అందరూ ఉన్న ఈ వేదికపై ఈ ఘటనతో అందరూ షాక్ అయ్యారు. తన సీటులో ఎలా కూర్చుంటావు అంటూ వీహెచ్ ప్రశ్నించటంతో వివాదం మొదలైంది.

వీహెచ్ – నగేశ్ మధ్య జరిగిన గొడవతో కాంగ్రెస్ లో విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. నేతల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. మిగతా పార్టీలు, ప్రజాసంఘాల ప్రతినిధుల మధ్యే కాంగ్రెస్ నేతలు కొట్టుకోవటం.. వీహెచ్ లాంటి సీనియర్ నేతపైనే చేయి చేసుకోవటం కలకలం రేపుతోంది. దీనిపై పార్టీ క్రమశిక్షణ సంఘం, పీసీసీ చీఫ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.