ఓడిపోతామనే భయంతోనే ప్రేలాపనలు : తలసాని
ఏపీ సీఎం బాబుకు సిగ్గు లేదు..నిజాయితీ లేదు..కనకదుర్గ ఫ్లై ఓవర్ కట్టడానికి 5 సంవత్సరాలు పడుతుందా ? పాలన చేయడం చేతకాదు..

ఏపీ సీఎం బాబుకు సిగ్గు లేదు..నిజాయితీ లేదు..కనకదుర్గ ఫ్లై ఓవర్ కట్టడానికి 5 సంవత్సరాలు పడుతుందా ? పాలన చేయడం చేతకాదు..
ఏపీ సీఎం బాబుకు సిగ్గు లేదు..నిజాయితీ లేదు..కనకదుర్గ ఫ్లై ఓవర్ కట్టడానికి 5 సంవత్సరాలు పడుతుందా ? పాలన చేయడం చేతకాదు..చేతకాని దద్దమ్మ..ఆయన మాటలను చూస్తే ఓడిపోతామనే భయం నెలకొంది.. అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బాబుపై విరుచుకపడ్డారు. ఏపీలో జరిగిన ఎన్నికలపై బాబు చేసిన కామెంట్స్‌పై తలసాని తీవ్రంగా స్పందించారు. ఏప్రిల్ 13వ తేదీ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
జగన్ 3 రోజులు మాయమయ్యాడని అన్న బాబు..ఆయన గాయబ్ అయితే..ఏమైంది..ఇంకా మంచిగా ప్రచారం చేసుకోవచ్చు కదా..అన్నారు తలసాని. ఏపీలో జరిగిన ఎన్నికల్లో తాడిపత్రి, నరసరావుపేటలోని సత్తెనపల్లి, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగాయని..మంగళగిరిలో మాత్రం లోకేష్‌ది డ్రామా అని ఎద్దేవా చేశారు. ఒక బాధ్యత గల స్పీకర్..సత్తెనపల్లికి వెళ్లి పోలింగ్ బూత్ తలుపులు వేసుకుంటారా ? ఇదంతా టీవీల్లో వచ్చాయని గుర్తు చేశారు.
Read Also : ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసిన చంద్రబాబు : వైసీపీ అనుమానం
EVMలో ఒక పార్టీకి ఓటేస్తే ఇంకొక పార్టీకి వెళుతోందని..చీఫ్ సెక్రటరీ ఏజెంట్..ఇలా ఇష్టమొచ్చినట్లు బాబు వ్యాఖ్యానించారని..అంతా చిల్లర రాజకీయాలని కొట్టిపారేశారు. బాబు..18 కేసుల్లో స్టే తెచ్చుకోలేదా ? అని నిలదీశారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ వారిపై..ఆస్తులపై దాడులు చేశారా ? అయితే బాబు..నిజాయితీగా ఉంటే..ఇక్కడున్న ఆస్తులు అమ్ముకుని ఏపీలోనే ఉండాలని సూచించారు తలసాని.
కేసీఆర్ ఐదేళ్ల పాలనలో సంతోషంగా ఉన్న సమయంలో బాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో TRS డబ్బులు ఖర్చు పెట్టిందని ఆరోపించిన బాబు..కాణిపాకం వినాయక స్వామి టెంపుల్‌లో ఒట్టు వేస్తావా ? తాను ఒట్టు వేయడానికి సిద్ధమని తలసాని సవాల్ విసిరారు. బాబు నోరు తెరిస్తే అని అబద్దాలే..మురికి నోరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ జాతీయ పార్టీయా ? దేశంలో ఒక్క ఎమ్మెల్యే అయినా ఉన్నాడా ? ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీకి వెళుతావ్ అంటూ వ్యాఖ్యానించారు. హెరిటేజ్ పాలు..పెరుగు..కూరగాయలు అమ్ముకుని 16 వందల కోట్లు సంపాదిస్తారా ? ఎలా వస్తాయి అని తలసాని సందేహం వ్యక్తం చేశారు. మరి తలసాని చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Read Also : స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి ఇచ్చావా..KCR – జీవన్ రెడ్డి