కేసీఆర్ ఎంత తిడితే అంత సంతోషిస్తున్న బీజేపీ నేతలు. ఇదేం లెక్కా?
ఎవడైనా తిడితే... ఎదురు తిట్టడమో.. లేదా బాధపడే వాళ్లను చూశాం. ఏంటో.. ఎన్ని తిట్లు తిడితే అంత సంతోషించే వారూ ఉన్నారు. ఈ విచిత్ర జీవులు ఎవరని ఆశ్చర్యపోతున్నారా?

ఎవడైనా తిడితే… ఎదురు తిట్టడమో.. లేదా బాధపడే వాళ్లను చూశాం. ఏంటో.. ఎన్ని తిట్లు తిడితే అంత సంతోషించే వారూ ఉన్నారు. ఈ విచిత్ర జీవులు ఎవరని ఆశ్చర్యపోతున్నారా?
ఎవడైనా తిడితే… ఎదురు తిట్టడమో.. లేదా బాధపడే వాళ్లను చూశాం. ఏంటో.. ఎన్ని తిట్లు తిడితే అంత సంతోషించే వారూ ఉన్నారు. ఈ విచిత్ర జీవులు ఎవరని ఆశ్చర్యపోతున్నారా? తెలంగాణ బీజేపీ నాయకులు. అసలు వారిని తిడుతున్నదెవరు? తిట్టినా సంతోషించడానికి కారణమేంటి? వారి సంబరానికి అర్థం పరమార్థం ఏంటి?
టీఆర్ఎస్ కౌంటర్లతో సంబరపడుతున్న బీజేపీ నేతలు:
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ రాష్ట్ర బీజేపీ దూకుడు పెంచింది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని ఎప్పటికప్పుడు ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చింది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ విమర్శలు చేసేది. విమర్శలను ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ, మంత్రులు గానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు గానీ పెద్దగా పట్టించుకునేవారు కాదు. బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తే తప్ప వారు కౌంటర్లు ఇచ్చేవారు కాదు. కానీ, ఈ మధ్యలో బీజేపీ నేతలు ఎవరు మాట్లాడినా వాటికి టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతిస్పందన వస్తోంది. దీంతో కమలం పార్టీ నేతల్లో ఉత్సాహం మొదలైందంటున్నారు. తమ విమర్శలకు వారు ఉలిక్కి పడుతున్నారని, అందుకే కౌంటర్లు ఇస్తున్నారని లోలోపల సంబరపడిపోతున్నారట బీజేపీ నేతలు. నా విమర్శల దెబ్బకు ఆ నేత స్పందించాడు చూడంటూ సన్నిహితుల ముందు చిందులేస్తున్నారట.
Also Read | కేసీఆర్ ఔదార్యం : వృద్ధుడి కోసం ఆగి..సమస్య తెలుసుకుని
సీఏఏపై ఇరుకున పెట్టే ప్రయత్నాలు ఫలించలేదా?
ఇంటర్మీడియట్ ఫలితాలు విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ స్వయంగా బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ నిరాహార దీక్ష చేశారు. కానీ, దానిపై ప్రభుత్వం గానీ, టీఆర్ఎస్ నేతలు గానీ స్పందించిన దాఖలాలు లేవు. ఆ తర్వాత విద్యుత్ అంశాన్ని తెరపైకి తీసుకు వస్తే అది కాస్తా కాంగ్రెస్, విద్యుత్ ఉద్యోగుల మధ్య వార్‌గా మారింది. మున్సిపల్ ఎన్నికల సమయంలో సీఏఏ అంశంపై టీఆర్ఎస్ నేతలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ సీఏఏపై ఘాటుగా స్పందించారు. ఆ తర్వాత బీజేపీ పట్ల టీఆర్ఎస్ తన వైఖరి మార్చుకుని ఎదురుదాడికి దిగుతోందని బీజేపీ నేతలు అంటున్నారు.
టీఆర్ఎస్ ప్రతిస్పందనతో తమ బలం పెరిగిందంటున్న బీజేపీ:
నిజామాబాద్‌లో స్పైస్ బోర్డును పసుపు బోర్డుగా బీజేపీ చేస్తోన్న ప్రచారాన్ని టీఆర్ఎస్ మంత్రులు, నేతలు తిప్పికొట్టారు. కేంద్ర బడ్జెట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వివరణ ఇచ్చుకున్నారు. ప్రొటోకాల్ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన విమర్శలకు మంత్రి తలసాని సమాధానమిచ్చారు. రైల్వే శాఖ మంత్రి గోయల్ వ్యాఖ్యలను సైతం టీఆర్ఎస్ నేతలు తిప్పికొట్టారు. దీంతో బీజేపీ వైఖరితో పాటు ఆ పార్టీ నేతల మాటలకు టీఆర్ఎస్ నుంచి వస్తోందని కమలనాథులు ఆనందిస్తున్నారట. ఆ పార్టీ తమను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నందునే ఉలిక్కిపడి, తమపై కౌంటర్లకు దిగుతోందని చెప్పుకుంటున్నారట. ఎప్పుడూ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే విమర్శలు ప్రతి విమర్శలు ఉండేవని, ఇప్పుడు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య విమర్శలు సాగుతుండడమే తాము బలపడ్డామనడానికి నిదర్శనమని జబ్బలు చరుచుకుంటున్నారట.