తెలంగాణ బడ్జెట్ : ఆసరా పెన్షన్స్ రూ.12 వేల 67 కోట్లు 

  • Published By: veegamteam ,Published On : February 22, 2019 / 07:31 AM IST
తెలంగాణ బడ్జెట్ : ఆసరా పెన్షన్స్ రూ.12 వేల 67 కోట్లు 

Updated On : February 22, 2019 / 7:31 AM IST

హైదరాబాద్: తెలంగాణ 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను సీఎం కేసీఆర్ ఆర్థిక మంత్రిగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆసరా పెన్షన్స్ కోసం రూ.12 వేల 67 కోట్లను కేటాయించామని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాల బాధితులు, నేత, గీతా కార్మికులు, ఎయిడ్స్ వాధిగ్రస్థులకు ఇచ్చే నెలసరి పెన్షన్ మొత్తాన్ని రూ. 1000 నుంచి రూ. 2,016కు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.

అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ రూ. 1500 నుంచి రూ. 3,016కు పెంచుతున్నట్లు వెల్లడించారు. వృద్ధాప్య పెన్షన్‌కు కనీస అర్హత వయస్సు 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి పెరిగిన పెన్షన్ అందిస్తామని ప్రకటించారు. ఓటాన్ అకౌండ్ బడ్జెట్‌ను కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆసరా పెన్షన్ల కోసం ఈ బడ్జెట్‌లో రూ. 12 వేల 67 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం అనేక మందిని అసహయులుగా మార్చిందన్నారు. వారికి గత ప్రభుత్వాలు వృద్ధాప్య పెన్షను కింద కొన్నాళ్లు రూ. 75 మరికొన్నాళ్ల్లు రూ. 200 మాత్రమే విదిలించి వృద్ధులను ఎంతో ఉద్ధరించినట్లు చెప్పుకున్నాయన్నారు. ప్రభుత్వాలు విదిలించిన ఆ తక్కువ మొత్తం ఏ చిన్న అవసరం కూడా తీర్చుకునేందుకు సరిపోయేది కాదన్నారు. ఇది సరైన విధానం కాదని భావించి అసహాయులను అందరిని ఆదుకునే విధంగా తెలంగాణ ఏర్పడిన వెంటనే వృద్ధులు, వితంతువుల పింఛన్లను రూ. 200 నుంచి రూ. 1000కి.. దివ్యాంగుల పెన్షన్లు రూ. 1500కి పెంచినట్లు తెలిపారు. 

Read Also: నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు కేటాయింపు
Read Also: తెలంగాణ బడ్జెట్ : కళ్యాణ లక్ష్మి రూ.1,450 కోట్లు
Read Also: ఆరోగ్య తెలంగాణ : ENT, దంత పరీక్షల కోసం రూ.5వేల కోట్లు