తెలంగాణా కేబినెట్ భేటీ, నాలుగు అంశాలున్నా…. మెయిన్ అజెండా ఇదే!

తెలంగాణా కేబినెట్ భేటీ, నాలుగు అంశాలున్నా…. మెయిన్ అజెండా ఇదే!

Updated On : August 5, 2020 / 3:55 PM IST

తెలంగాణ మంత్రి వర్గం బుధవారం మధ్యాహ్నం 2గంటలకు సమావేశం కానుంది. ఈ క్యాబినెట్ అజెండాలో నాలుగు అంశాలను పరిశీలించనున్నారు. కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై కూడా నిర్ణయం తీసుకునేట్లుగా కనిపిస్తున్నారు. నియంత్రిత వ్యవసాయం, కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.



స్కూల్స్ ఓపెన్ చేయడానికి సాధ్యాసాధ్యాలు, రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు, కొత్త విద్యా విధానం, కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చిస్తున్నారు. ఇలా వివిధ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు తెలంగాణ క్యాబినెట్.

కొత్త సచివాలయ నమునాను ఇప్పటికే ఫైనల్ చేశారు సీఎం కేసీఆర్. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కొత్త సచివాలయ నిర్మాణం, భవన నమూనాల అంశంపై ప్రధానంగా చర్చ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.



మరోవైపు కరోనా వైరస్‌ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, ఇంకా ఎలాంటి యాక్షన్‌ ఉండాలన్న దానిపైనా చర్చ జరుగుతుంది. కరోనా కారణంగా పలు ఎంట్రన్స్‌లు, డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. వాటిని ఎప్పుడు నిర్వహించాలి. స్కూళ్లు, కాలేజీలు ఎప్పుడు తెరవాలనే దానిపైనా మంత్రివర్గంలో చర్చ ఉండే అవకాశం ఉంది. కొత్త విద్యా విధానం చర్చకు వచ్చే అవకాశం ఉంది.