కేసీఆర్ టీమ్ ఇదేనా ? 

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 19న రాజ్ భవన్ వేదికగా కేబినెట్ విస్తరణ జరుగనుంది.

  • Published By: veegamteam ,Published On : February 15, 2019 / 02:52 PM IST
కేసీఆర్ టీమ్ ఇదేనా ? 

Updated On : February 15, 2019 / 2:52 PM IST

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 19న రాజ్ భవన్ వేదికగా కేబినెట్ విస్తరణ జరుగనుంది.

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 19న రాజ్ భవన్ వేదికగా కేబినెట్ విస్తరణ జరుగనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సీఎం కేసీఆర్…గవర్నర్‌ నరసింహన్‌కు అందజేశారు. అయితే ఇందులో ఎంత మందికి అవకాశం దక్కనుంది…ఎవరేవరికి ఛాన్స్ ఇస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం…గత 62 రెండు రోజులగా సీఎం, హోంమంత్రులతోనే నడుస్తుంది. డిసెంబర్ 13న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌ ఇంత వరకు కేబినేట్ విస్తరణ చేపట్టలేదు. మొత్తానికి అనేక ప్రచారాలు, ఉహాగానాలన్నింటికి తెరదించుతూ మంత్రి వర్గ విస్తరణ తేదీని ఖరారు చేశారు. మాఘ శుద్ధ పౌర్ణమి ఫిబ్రవరి 19న ఉదయం 11 గంటల 30 నిమిషాలకి రాజ్‌భవన్ వేదికగా విస్తరణ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ గవర్నర్‌ నరసింహన్‌కు అందజేశారు. 

ఇక సీఎం కేసీఆర్ ప్రకటనతో మంత్రి వర్గంపై చర్చ మొదలైంది. ఈ సారైనా పూర్తి స్ధాయి విస్తరణ ఉంటుందా..లేక కేవలం పది మందికే పరిమితం చేస్తారా అనే దానిపై గులాబీ శ్రేణుల్లో హాట్ హాట్‌గా డిస్కషన్స్ సాగుతున్నాయి. రాష్ట్రంలో 119 శాసనసభ్యులకు గాను ముఖ్యమంత్రి కాక మరో 17 మందికి కేబినెట్‌లో ఛాన్స్ ఉంటుంది. అందులో ఇప్పటికే మహాముద్ అలీ మంత్రిగా ఉన్నారు కాబట్టి మరో 16 మందికి మంత్రులయ్యే అవకాశం ఉంది. మరి సీఎం కేసీఆర్ ఎంతమందిని మంత్రులు చేస్తారన్నదే ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. 

ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే…తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో పాటు చర్చల్లో ప్రభుత్వం తరుపున ప్రతిపక్షాలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఒక్క సీఎం వల్ల  సాధ్యం కాదు. కాబట్టి  తప్పని సరిగా మంత్రి వర్గంను నియమించుకోవాలి. బడ్జెట్ కోసం ఆర్ధిక మంత్రి, సభా వ్యవహారాల కోసం మరో మంత్రి అయితే తప్పని సరి. సభా నిర్వహణలో విప్‌లు, ఛీప్ విప్‌లు, డిప్యూటీ స్పీకర్‌లు ఖచ్చింతగా ఉండాలి. అందుకే బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి  రెండు రోజుల ముందే సీఎం తన కేబినేట్‌ విస్తరణకు ముహుర్తం ఖరారు చేశారు.
 
మొత్తంగా ఈ సారి కేబినెట్‌లో చోటు ఎవరెవరికి అనే దాని కంటే…అసలు పూర్తి స్థాయి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా…లేక ప్రచారం జరుగుతున్నట్లుగానే 10 లేదా 8 మందికే పరిమితమవుతుందా…అనేది తేలాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.