సబితకు హోం, హరీష్ కి ఆర్థిక : కొత్త మంత్రులకు ఇచ్చే శాఖలు ఇవే
ఆదివారం(సెప్టెంబర్ 8,2019) సాయంత్రం 4 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. మంత్రుల ప్రమాణానికి రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

ఆదివారం(సెప్టెంబర్ 8,2019) సాయంత్రం 4 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. మంత్రుల ప్రమాణానికి రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
ఆదివారం(సెప్టెంబర్ 8,2019) సాయంత్రం 4 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. మంత్రుల ప్రమాణానికి రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆరుగురికి సీఎంవో నుంచి సమాచారం అందింది. మరోవైపు.. శనివారం(సెప్టెంబర్ 7,2019) రాత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుతో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. చాలా రోజుల తర్వాత వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈటల రాజేందర్‌ను కేసీఆర్ ప్రగతి భవన్‌కు పిలిపించారు. ఈటలతో ప్రత్యేకంగా మాట్లాడారు.
మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠకు తెరపడటంతో.. ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. హరీశ్‌రావుకు నీటిపారుదల లేదా ఆర్థిక శాఖ, కేటీఆర్‌కు పట్టణాభివృద్ధి, ఐటీ శాఖలు ఇచ్చే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. సత్యవతి రాథోడ్‌కు గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ, గంగుల కమలాకర్‌కు బీసీ సంక్షేమ శాఖ కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. పువ్వాడ అజయ్‌కు మైనింగ్ శాఖ కేటాయించే ఛాన్స్ ఉందని… సబితా ఇంద్రారెడ్డికి హోంశాఖ ఇస్తారంటూ జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి.
మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండడంతో… మొత్తం ఇదే దఫాలో భర్తీ చేస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ లకు పదవులు ఖరారయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ సీఎంగా… మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఫిబ్రవరి 19న మరో 10మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఇప్పుడే రెండోసారి మంత్రివర్గాన్ని కేసీఆర్ విస్తరించనున్నారు. అంతేకాకుండా అన్ని రకాల పదవులను భర్తీ చేయాలని కూడా నిర్ణయించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ విప్‌ల నియామకాన్ని ఖరారు చేసిన కేసీఆర్… ఆదివారం దశమి పూట మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
ఖమ్మం జిల్లాకు ఇప్పటివరకు మంత్రివర్గంలో చోటు లేకపోవడంతో…ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కి అవకాశం దక్కింది. తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వీరయ్య పేర్లు కూడా వినిపించాయి. ఇద్దరు మహిళా మంత్రులను తీసుకుంటామని కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఆ మాటను ఇప్పుడు నిలుపుకునే పనిలో ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లకు మంత్రి పదవులు ఖాయం చేశారు.
* రెండోసారి అధికారంలోకి వచ్చిన 9 నెలల తర్వాత కేబినెట్ విస్తరణ
* కేబినెట్ లోకి తొలిసారిగా ఇద్దరు మహిళలు
* ఎమ్మెల్సీగా ఉన్న సత్యవతి రాథోడ్
* కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన సబితా ఇంద్రారెడ్డి
* కేబినెట్ లో గంగులకు చోటుతో ఉమ్మడి కరీంనగర్ లో ముగ్గురు మంత్రులు