కొండా@రూ.895కోట్లు, పాటిల్@రూ.126కోట్లు : ఎన్నికల బరిలో కోటీశ్వరులు
ఓ వైపు నామినేషన్లు.. మరోవైపు ప్రచారం.. తెలంగాణలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరిగిపోతోంది. అయితే.. ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోందో విషయం.

ఓ వైపు నామినేషన్లు.. మరోవైపు ప్రచారం.. తెలంగాణలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరిగిపోతోంది. అయితే.. ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోందో విషయం.
ఓ వైపు నామినేషన్లు.. మరోవైపు ప్రచారం.. తెలంగాణలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరిగిపోతోంది. అయితే.. ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోందో విషయం. అదే నేతల ఆస్తుల చిట్టా. నామినేషన్‌తో పాటు దాఖలు చేస్తున్న ఆస్తుల వివరాలు సామాన్యుల మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది. ఇంతకీ.. తెలంగాణలో ముఖ్య నేతల ఆస్తులెన్నీ.. అప్పులెన్నీ.. అఫిడవిట్ ప్రకారం..
Read Also : ఎవరి ఆస్తి ఎంతంటే : కొండా విశ్వేశ్వరెడ్డి రూ. 895 కోట్లు
– తెలంగాణలో ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తుల పరంగా అగ్రస్థానంలో ఉన్నారు. తనకు 895 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు చూపించారు. అందులో 856 కోట్లు చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. కాగా 35కోట్లకు పైగా అప్పులున్నట్లు తెలిపారు. 2014 ఎన్నికలప్పుడు పేర్కొన్న ఆస్తులతో పోలిస్తే 528.52 కోట్ల నుంచి 895 కోట్లకు పెరిగినట్లు తేలింది.
– ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసిన నలుగురు అభ్యర్థులూ కోటీశ్వరులే. జహీరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ పేరిట 126 కోట్ల 91 లక్షల విలువైన ఆస్తులు.. కోటి 15లక్షల మేర అప్పులు ఉన్నట్లు చూపించారు.
– మెదక్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి కుటుంబ ఆస్తి 126 కోట్ల 65 లక్షలుగా ఉంది.
– జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్‌రావు పేరు మీద 87 కోట్ల 80 లక్షల విలువైన ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.
– బీజేపీ నుంచి నిజామాబాద్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధర్మపురి అరవింద్ కుటుంబానికి 87 కోట్ల 67 లక్షల విలువైన ఆస్తులున్నట్లు ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. అప్పులు కింద 35 కోట్ల 04 లక్షలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు.
– మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి 58 కోట్ల 63లక్షల విలువైన ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
– సికింద్రాబాద్ నుంచి టీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేసిన తలసాని సాయికిరణ్ పేరు మీద 54 కోట్ల 61లక్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.
– మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న రేవంత్‌రెడ్డి కుటుంబానికి 26 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. అందులో రేవంత్ భార్య పేరిటే 14కోట్లకు పైగా ఆస్తులున్నట్లు వెల్లడించారు. రేవంత్‌రెడ్డిపై 42 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
– నిజామాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి కవిత తనకు 6 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. భర్త అనిల్ కుమార్ పేరిట 2 కోట్లకు పైగా ఆస్తులు.. కుమారులు ఆదిత్య పేరిట 24 లక్షలకుపై గానూ, ఆర్య పేరుపై 30 లక్షలకు పైగా ఆస్తి ఉన్నట్లు తెలిపారు. చేతిలో కోటీ తొంభై లక్షల నగదు ఉన్నట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
– టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తన పేరిట 3 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు ప్రకటించారు. మొత్తానికి తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి ఎక్కువగా శ్రీమంతులే బరిలో దిగుతుండటం ఆసక్తి కలిగిస్తోంది.
Read Also : ఆయారాం..గయారాం : అంతిమ లక్ష్యం టికెట్ సాధించడమే