ఆర్టీసీ కార్మికులకు మళ్లీ షాకిచ్చిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరోసారి షాకిచ్చింది. విలీనం డిమాండ్‌ను పక్కనబెట్టినప్పటికీ... కార్మికుల్ని విధుల్లోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పింది.

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరోసారి షాకిచ్చింది. విలీనం డిమాండ్‌ను పక్కనబెట్టినప్పటికీ… కార్మికుల్ని విధుల్లోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పింది.
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరోసారి షాకిచ్చింది. విలీనం డిమాండ్‌ను పక్కనబెట్టినప్పటికీ… కార్మికుల్ని విధుల్లోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పింది. సర్కార్ తరఫున హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఆర్టీసీ ఇన్‌చార్జ్ ఎండీ సునీల్‌శర్మ… కార్మికుల డిమాండ్లను పరిష్కరించే ఆర్థిక పరిస్థితి యాజమాన్యానికి లేదని స్పష్టం చేశారు.
ఆర్టీసి సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి తమ వైఖరి స్పష్టం చేసింది. ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ ఫైనల్ అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించారు. కార్మికులతో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరపలేదని… ప్రస్తుతం సంస్థ ఆర్థిక పరిస్థితి బాగాలేదని స్పష్టం చేశారు. విలీనం డిమాండ్‌ను కార్మికుల పక్కనబెట్టినప్పటికీ… మిగతా డిమాండ్లను కూడా పరిష్కరించేందుకు సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. కార్మికుల సమ్మె వల్ల సంస్థకు ఇప్పటివరకు 44 శాతం నష్టాలు వచ్చాయని హైకోర్టుకు నివేదించారు. కొంతమంది యూనియన్ నేతలు తమ స్వార్థం కోసం మొత్తం ఆర్టీసీనే నష్టాల్లోకి నెడుతున్నారని… కార్మికుల కోసం కాకుండా, యూనియన్ నేతలు తమ సొంత ఉనికి కోసం సమ్మె చేస్తున్నారని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెను చట్ట వ్యతిరేకమైందిగా కోర్టు ఆదేశించాలంటూ సునీల్‌శర్మ కోరారు. సామాన్య ప్రజలు ఇబ్బందులు పుడతారని తెలిసి కూడా కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లాయని… సంఘాల ప్రవర్తనతోనే ఆర్టీసీ కార్పొరేషన్ ఈ స్థితికి వచ్చిందన్నారు. ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కష్టాల్లోకి నెట్టేందుకు యూనియన్ నేతలు పని కట్టుకుని సమ్మె బాట పట్టారని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రతి చిన్న విషయానికి కార్మికులు సమ్మెబాట పడుతున్నారని… ప్రభుత్వం నేరవేర్చడానికి వీల్లేని డిమాండ్లతో అనేకసార్లు సమ్మెకు వెళ్లారన్నారు. మిగతా కార్పొరేషన్లతో పోలిస్తే ఆర్టీసీ కార్మికులు ప్రతిసారి సమ్మెకు వెళ్తున్నారని సునీల్‌శర్మ కోర్టుకు నివేదించారు.
ప్రభుత్వంపై కుట్రపూరితంగా వ్యవహరించేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రతిపక్షాలతో చేతులు కలిపారని సునీల్‌శర్మ కోర్టుకు తెలిపారు. కార్మికులు యూనియన్ల మాటలు నమ్మి నష్టపోతున్నారని… ఇప్పుడు కార్మికులు విధుల్లో చేరతామన్న తీసుకునే పరిస్థితుల్లో ఆర్టీసీ లేదన్నారు. ఆర్టీసీ సమ్మెతో సామాన్య ప్రజలు 43 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిసి కూడా… కార్మికులు ఇంకా తమ పంథా మార్చుకోవడం లేదన్నారు. ఆర్టీసీ కార్పొరేషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా కార్మికుల డిమాండ్లను పరిష్కరించే స్థితిలో లేదని స్పష్టం చేశారు.
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరి మరోసారి స్పష్టం చేయడంతో… కార్మిక సంఘాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. విలీనం డిమాండ్‌ను పక్కనబెట్టినప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోవడంతో… న్యాయస్థానంలో తమ వాదనలు వినిపిస్తామంటున్నారు జేఏసీ నేతలు.