ఇక చట్టాలు తెలుగులో

హైదరాబాద్ : చట్టాలు కేవలం ఇంగ్లీషులోనే ఉంటాయా ? ఏం తెలుగులో ఉండకూడదా ? ఇదే ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. చట్టాలు తెలుగులో ఉంటే ప్రజలకు చక్కగా అర్థమౌతుందని..అందుకు తెలుగులో చట్టాలు మార్చాలనే ఆలోచన సీఎం కేసీఆర్‌కు వచ్చింది. ఈ ఆలోచన మాత్రం వరల్డ్ తెలుగు మహాసభల్లోనే వచ్చింది.
తెలుగులో చట్టాలను మార్చాలని..ఈ బాధ్యతలను దేశపతి శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఆయాచితం శ్రీధర్‌కు అప్పగించారు. ప్రభుత్వ పరిపాలనా నిబంధనావళి, సచివాలయ నిబంధనలను తెలుగులోకి అనువదించింది. వీటిని సీఎం కేసీఆర్‌కు పంపించారు. వీటికి ఆమోదం తెలుపగానే ప్రజలకు అందుబాటులోకి తెస్తారు. ఆయా శాఖల వెబ్ సైట్లలోనూ పొందుపరిచేందుకు ఏర్పాట్లు చేశారు.
టి.సర్కార్ తీసుకొచ్చిన కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని కూడా తెలుగులోకి అనువదించేందుకు ప్రక్రియ కూడా స్టార్ట్ చేశారని టాక్. చట్టాలన్నింటినీ తెలుగులోకి అనువాదం చేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని తెలుస్తోంది.