బద్దకించిన నగరవాసులు : హైదరాబాద్‌లో తగ్గిన పోలింగ్

భాగ్యనగర వాసులు బద్ధకించారు. తమ భవిష్యత్తును నిర్దేశించే నాయకులను ఎన్నుకునేందుకు ప్రజలు ముందుకు రాలేదు. రాష్ట్రంలోనే సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది. నగర ఓటర్లలో సగం మంది కూడా తమ హక్కును వినియోగించుకోలేదు.
నిరక్షరాస్యులు అధికంగా ఉండే పల్లెల్లో ఓటింగ్ శాతం పెరుగుతుంటే.. చదువుకున్నవారు ఎక్కువగా ఉండే హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏప్రిల్ 11వ తేదీ గురువారం ఓటింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 61శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మెదక్ లో 68.60 శాతం నమోదు కాగా.. అత్యల్పంగా సికింద్రాబాద్ లో 39.20 శాతం ఓట్లు పోలయ్యాయి.
Read Also : రెడీ టు అప్లయ్ : SBIలో 8వేల 904 క్లర్క్ పోస్టులు
హైదరాబాద్ జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజలు ఓటు వేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపలేదు. హైద్రాబాద్ లో 39.49శాతం పోలింగ్ నమోదు కాగా.. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 39.20 శాతం పోలింగ్ రికార్డ్ అయింది. విద్యావంతులు, మేధావులు, యువత, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా వున్న జిల్లాలోనే పోలింగ్ శాతం తగ్గిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.
హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 19లక్షల 57వేల 772 మంది ఓటర్లు, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో 19లక్షల 68లక్షల 147మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో నామ మాత్రంగానే ఓటర్లు వచ్చి తమ ఓటు హాక్కును వినియోగించుకున్నారు. హైద్రాబాద్ జిల్లాలో ఉదయ 9గంటల లోపు 8 శాతం, 11గంటల వరకు 12.12శాతం, మధ్యాహ్నం 1 గంట వరకు 20.59 శాతం, 3 గంటల వరకు 27.79శాతం పోలింగ్ రికార్డ్ అయ్యింది. ఇక సాయంత్రం 5 గంటల వరకు 39.49 శాతం పోలింగ్ నమోదైంది.
Read Also : పెరిగిన పోలింగ్ శాతం మాకే అనుకూలం : భారీ మెజార్టీతో గెలుపు ఖాయం
2019 | 2014 | |
హైదరాబాద్ | 39.49 | 53.27 |
సికింద్రాబాద్ | 44.99 | 53.06 |
మల్కాజ్ గిరి | 49.11 | 51.05 |
చేవెళ్ల | 53.80 | 60.51 |
రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇది కూడా ఓటింగ్ శాతం తగ్గడానికి కారణంగా భావిస్తున్నారు. అలాగే లోక్‌సభ ఎన్నికలను ఈసారి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఒకే విడతలో నిర్వహించడం కూడా పోలింగ్ శాతంపై ప్రభావం చూపింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు రెండు దఫాలుగా జరిగేవి. 2014లో కూడా తెలంగాణ, ఏపీలో వేర్వేరు తేదీల్లో జరిగాయి. దాంతో రెండు చోట్ల ఓట్లు ఉన్నవారు మొదట తెలంగాణలో ఓటు వేసి, ఆ తర్వాత ఏపీలో వేశారు. ప్రస్తుతం ఒకే రోజు పోలింగ్ జరగడంతో రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నవారు ఏపీలో వేసేందుకే ప్రాధాన్యమిచ్చారు. వారంతా అక్కడికే వెళ్లడం, ఉన్నవారు ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడంతో.. తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం గణనీయంగా పడిపోయింది.
హైదరాబాద్ లోక్ సభ : –
అసెంబ్లీ నియోజకవర్గం | లోక్ సభ 2019 |
చార్మినార్ | 46 |
చాంద్రాయణ గుట్ట | 38.9 |
యాకత్ పురా | 31.1 |
బహదూర్ పురా | 37.8 |
మలక్ పేట | 33.21 |
కార్వాన్ | 44.0 |
గోషా మహల్ | 49.54 |
సికింద్రాబాద్ లోక్ సభ : –
అసెంబ్లీ నియోజకవర్గం | లోక్ సభ 2019 |
సికింద్రాబాద్ | 47.48 |
ముషీరాబాద్ | 36.70 |
అంబర్ పేట | 30.19 |
ఖైరతాబాద్ | 40.0 |
జూబ్లీహిల్స్ | 38.0 |
సనత్ నగర్ | 44.0 |
నాంపల్లి | 38.0 |
మల్కాజిగిరి లోక్ సభ : –
అసెంబ్లీ నియోజకవర్గం | లోక్ సభ 2019 |
ఎల్.బి.నగర్ | 44.53 |
కంటోన్మెంట్ | 47.81 |
ఉప్పల్ | 46.35 |
మల్కాజ్ గిరి | 49.79 |
కుత్బుల్లాపూర్ | 49.95 |
కూకట్ పల్లి | 50.71 |
మేడ్చల్ | 54.58 |