సర్వం సిద్ధం : తెలంగాణాలో MLC ఎన్నికలు

తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పట్టభద్రుల కోటాలో ఒకటి, ఉపాధ్యాయ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 22వ తేదీ శుక్రవారం పోలింగ్ జరగనుంది. గ్రాడ్యుయేట్స్ కోటాలో 17మంది పోటీలో ఉన్నారు. టీచర్ ఎమ్మెల్సీ బరిలో రెండు స్థానాలకు గాను.. 16మంది పోటీలో ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎలక్షన్ కోసం ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్లకు.. ఎలక్షన్ కమిషన్ ఓటరు స్లిప్పులను పంపిణీ చేసింది.
Read Also : ఆనందం ఎక్కడ.. ఎప్పుడూ ఏడుపే : ఇంకా దిగజారిన ఇండియా
కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్‌లో ఉపాధ్యాయ కోటాలో ఏడుగురు అభ్యర్థులు.. పట్టభద్రుల కోటాలో 17మంది పోటీలో ఉన్నారు. TRS మద్దతుతో గ్రూప్ వన్ ఆఫీసర్ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, కాంగ్రెస్ సపోర్ట్‌తో ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. 42 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. గ్రాడ్యుయేట్లు తమకే ఓటేస్తారని ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లక్షా 96 వేల 321మంది పట్టభద్రులుండగా.. 23 వేల 214మంది ఉపాధ్యాయ ఓటర్లున్నారు.
నల్లగొండ – ఖమ్మం – వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 9మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్యే పోటీ ఉంది. 20 వేల 585 మంది ఉపాధ్యాయులున్నారు. పీఆర్టీయూ నుంచి పూల రవీందర్‌ను టీఆర్ఎస్ బలపరుస్తోంది. యూటీఎఫ్ మద్దతుతో అలుగుబెల్లి నర్సిరెడ్డి పోటీలో ఉన్నారు.
వివిధ పరీక్షలకు సంబంధించి స్పాట్ వాల్యూయేషన్ లో ఉన్న టీచర్లకు, లెక్చరర్లకు, ఉద్యోగులకు ప్రభుత్వం క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. మరోవైపు.. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈనెల 26న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
Read Also : నాగబాబుకి రిటర్న్ గిఫ్ట్ : వైసీపీలోకి శివాజీరాజా!