పల్లె పోరు : కారుదే ఊరు

  • Published By: madhu ,Published On : January 31, 2019 / 01:19 AM IST
పల్లె పోరు : కారుదే ఊరు

హైదరాబాద్ : తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడతలోనూ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు అత్యధిక పంచాయతీలను కైవసం చేసుకుని సత్తా చాటారు. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.. మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో 86 శాతం పైగానే పోలింగ్ నమోదు కాగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు ఫిబ్రవరి8న ఎన్నికలు జరుగనున్నాయి. గెలిచిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, ఉపసర్పంచ్‌లు ఫిబ్రవరి2న  ప్రమాణ స్వీకారం చేయనున్నారు…

88.03 శాతం పోలింగ్‌ నమోదు
3529 పంచాయతీలకు ఎన్నికలు
టీఆర్‌ఎస్ 2505, కాంగ్రెస్‌ 954..
టీడీపీ13, బీజేపీ59..ఇతరులు 551

అసెంబ్లీ ఎన్నికలే కాదు నేటి పల్లెపోరులోనూ కారుజోరు కొనసాగింది. తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థులే మెజారిటీ గ్రామాల్లో విజయం సాధించారు. మూడు విడతల్లో జరిగిన ఎన్నికలు జనవరి 30వ తేదీ బుధవారంతో ముగిశాయి. తుది దశలో 88.03శాతం పోలింగ్‌ నమోదైంది. మూడో విడతలో 3,529 పంచాయతీలకు పోలింగ్‌ నిర్వహించగా.. టీఆర్‌ఎస్ 2505, కాంగ్రెస్‌ 954, టీడీపీ13, బీజేపీ59,ఇతరులు 551 మంది గెలుపొందారు. తుది ఫలితాలను ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

4,479 సర్పంచ్,  39,822 వార్డులకు ఎన్నికలు
10,654 వార్డులు, 769 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం
మొదటి విడతలో 85.76 శాతం పోలింగ్ నమోదు 
2629 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధుల విజయం 
920 స్థానాల్లో విజేతలుగా కాంగ్రెస్ అభ్యర్థులు
స్వతంత్ర అభ్యర్థులు 750
టీడీపీ 31, బీజేపీ 67, సీపీఐ 19, సీపీఎం 32 

జనవరి 7న రాష్ట్ర ఎన్నికల సంఘం మొదటి విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయగా 21న పోలింగ్ నిర్వహించారు. 4,479 సర్పంచ్,  39,822 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 10,654 వార్డులు, 769 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.  మొదటి విడతలో 85.76 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా 2629 స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థులు 920 స్థానాల్లో విజేతలుగా నిలిచారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు 750కి పైగా స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు. టీడీపీ 31, బీజేపీ 67, సీపీఐ 19, సీపీఎం 32 స్థానాల్లో గెలుపొందాయి. 

మొత్తం 4,135 సర్పంచ్ స్థానాలు
788 స్థానాలు ఏకగ్రీవం 
3,342 సర్పంచ్ స్థానాలకు 10,668 మంది
రెండో విడతలో 88.26 శాతం పోలింగ్ నమోదు 
టీఆర్ఎస్ పార్టీ నుంచి 2608 మంది 
కాంగ్రెస్ పార్టీ మద్దతుతో 834 మంది
టీడీపీ మద్దతుతో 39 మంది
బీజేపీ మద్దతుతో 37 మంది 

జనవరి 25న రెండో పోలింగ్ జరిగింది. మొత్తం 4,135 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. 788 స్థానాలు ఏకగ్రీవం కాగా  3,342 సర్పంచ్ స్థానాలకు 10,668 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. రెండో విడతలో 88.26 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి 2608 మంది మంది సర్పంచ్‌గా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో 834 మంది, టీడీపీ మద్దతుతో 39 మంది, బీజేపీ మద్దతుతో 37 అభ్యర్థులు సర్పంచ్‌లుగా విజయం సాధించారు. మూడు విడతల్లో గెలిచిన సర్పంచ్‌లతోపాటు వార్డు మెంబర్లు.. ఉపసర్పంచ్‌లు ఫిబ్రవరి 2న  ప్రమాణ స్వీకారాలు చేయనున్నారు. అదే రోజు తొలి గ్రామసభ నిర్వహిస్తారని పంచాయతీ రాజ్ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ గేజిట్ విడుదల చేశారు.