రామాయణం స్టాంప్ కలెక్షన్: తెలంగాణ వ్యక్తికి లిమ్కాబుక్ అవార్డ్

హైదరాబాద్: తెలంగాణకు చెందిన సీనియర్ పోస్టల్ అధికారి వి ఉపేదర్ లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. రామాయణంపై అరుదైన స్టాంపులను సేకరించినందుకు ఆయనకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు. తమిళనాడులోని మదురైలో పోస్ట్ మాస్టర్ జన్ రల్ గా పనిచేస్తున్నారు ఉపేందర్.
“లిమా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి ముగ్గురు సభ్యుల బృందం రామాయణంపై అరుదైన స్టాంపుల కలెక్షన్ వివరాలు సేకరించింది. వివిధ సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన అతి చిన్న స్టాంపులు, చిన్న షీట్లను, షీట్-లెట్స్, సావనీర్ షీట్లు.. అరుదైన పోస్టల్ కవర్స్ తో సహా మొత్తం 400 అరుదైన స్టాంపులను ఉపేందర్ కలెక్ట్ చేశారు.
Read Also : విప్రో చైర్మన్ గొప్ప మనసు: రూ.52,700 కోట్ల విరాళం
ఈ అరుదైన స్టాంపుల్లో సీతాదేవి, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణాసురుడు వంటి అరుదైన స్టాంపులున్నాయి. ఈ అరుదైన స్టాంపులను అతను సేకరించిన క్రమంలో ప్రపంచంలోనే అరుదైన కలెక్షన్ ఉపేందర్ వద్ద మాత్రమే ఉన్నాయని లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది.
వీటితో పాటు, సీతా మరియు రాముడు పట్టాభిషేకంపై అరుదైన స్టాంపులు కూడా తన కలెక్షన్ లో ఉన్నాయని ఆయన చెప్పారు. తెలంగాణలోని వివిధ సందర్భాలలో తపాలా విభాగం నిర్వహించిన అనేక ఫిలాటెలిక్ ప్రదర్శనలలో కూడా ఉపేద్ర పాల్గొన్నారు. ఈ ప్రదర్శనల్లో ఉపేందర్ కు పలు పతకాలే కాక..రామాయణంపై ప్రత్యేకంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ కూడా ఆయన గెలుచుకున్నారు. ఈ క్రమంలో సిడ్నీలో రామాయణంపై నిర్వహించనున్న ఎగ్జిబిషన్ లో తన కలెక్షన్ తో పాటిస్టేప్ చేద్దామనుకుంటున్నానని ఉపేంద్ర తెలిపారు.