నయా టెక్నాలజీ : పోస్టుపెయిడ్, ప్రీ పెయిడ్ కరెంటు మీటర్లు

హైదరాబాద్ : ఆధునాతన టెక్నాలజీ రోజు రోజుకు విస్తరిస్తోంది. సెల్ ఫోన్ రంగంలో పోస్టు పెయిడ్, ప్రీ పెయిడ్ ఎలా ఉన్నాయో ఇక విద్యుత్ మీటర్లు కూడా ఇదే విధంగా రానున్నాయి. విద్యుత్ రంగంలో హై టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా కరెంటు దొంగతనాలని అరికట్టేందుకు వినియోగదారులకు, విద్యుత్ పంపిణీ సంస్థలకు ఉపయోగపడేటట్లు స్మార్ట్ టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నారు. సెల్ ఫోన్‌లలో పోస్టు పెయిడ్, ప్రీ పెయిడ్ తరహాలోనే విద్యుత్ మీటర్లను అందుబాటులోకి తెచ్చారు.
ప్రస్తుతం ఉన్న విద్యుత్ మీటర్లు పోస్టుపెయిడ్‌గా భావిస్తే ఒక కొత్తగా వచ్చిన మీటర్లను ప్రీ పెయిడ్ భావించాల్సి ఉంటుందంటున్నారు. 2023 నాటికి దేశమంతటా ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్ల వ్యవస్థను అమల్లోకి తేవాలని కేంద్ర సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ రష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు కూడా ఇప్పటికే ప్రీ పెయిడ్ మీటర్ల వ్యవస్థను అమల్లోకి తెచ్చాయి.
మొదట గవర్నమెంట్ ఆఫీసుల్లో ప్రీ పెయిడ్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. మార్చి నెలాఖరు నాటికి రాష్ట్రంలో మొత్తం 25వేల ప్రభుత్వ ఆఫీసుల్లో వీటిని ఏర్పాటు చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. జీడిమెట్ల ఐడీఏలో పైలెట్ బేసిస్‌గా 8800 స్మార్ట్ మీటర్లను తయారు చేస్తున్నారు.
స్మార్ట్ మీటర్ల ఉన్న సదుపాయాల ద్వారా ప్రీ పెయిడ్ విధానం సెలెక్ట్ చేసుకుని నెలకు ఎన్ని యూనిట్ల విద్యత్ అవసరమో అంతే మొత్తానికి ముందుగానే ఛార్జీలు చెల్లించి ప్రీ పెయిడ్ మీటర్‌లో ఛార్జీంగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఛార్జింగ్ పూర్తయితే కరెంటు ఆఫ్ అయిపోతుంది. దీనివల్ల దుబారా, వృథా వంటివి అరికట్టే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఇక విద్యుత్ ఛార్జీల బకాయిలు రోజు రోజుకు అధికమౌతున్నాయి. వివిధ శాఖల్లో ఇవి లక్షల రూపాయల దాకా ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్పీడీసీఎల్ పరిధిలో ప్రభుత్వ ఆఫీసుల నుండి సుమారు రూ. 120 కోట్ల వరకు విద్యుత్ ఛార్జీలు రావాల్సి ఉందని అంచనా. ప్రీ పెయిడ్ మీటర్ల వల్ల డిస్కమ్‌లకు విద్యుత్ బకాయిల సమస్య తొలగిపోతుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని కేటగిరిల విద్యుత్ కనెక్షన్లకు ప్రీ పెయిడ్ మీటర్లు అమర్చాల్సి వస్తే 1.40 కోట్ల మీటర్లు అవసరం అని డిస్కమ్‌లు అంచనా వేశాయి. ఎత్తిపోతల పథకాలు వంటి వారికి మినహాయింపు ఇవ్వనున్నారు.
ఇక స్మార్ట్ ఫోన్స్‌లలో ఉండే వివిధ రకాల ఫీచర్స్ త్వరలోనే ఉపయోగించుకొనే అవకాశం ఉంది. రిమోట్‌తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. స్మార్ట్ మీటర్లుగా పేర్కొనే ఈ మీటర్లలో ప్రీ పెయిడ్ విద్యుత్ ఛార్జింగ్ ఒక భాగం మాత్రమే అని అధికారులు వివరిస్తున్నారు. ఇందులో కరెంటు దొంగతనం చేస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఇంట్లో వాడే విద్యుత్‌కు సంబంధించిన వస్తువులను ఎక్కడి నుండైనా ఆన్ – ఆఫ్ చేసుకోవచ్చు. దీనివల్ల సమయం కూడా కలిసి వస్తుందని అధికారులు అంటున్నారు.