తెలంగాణలో 7 to 11 క్లాసులకు యూట్యూబ్ పాఠాలు..

  • Published By: veegamteam ,Published On : February 27, 2020 / 05:23 AM IST
తెలంగాణలో 7 to 11 క్లాసులకు యూట్యూబ్ పాఠాలు..

Updated On : February 27, 2020 / 5:23 AM IST

తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ విద్యార్ధులు ఇక నుంచి యూట్యూబ్ ద్వారా పాఠాలు నేర్చుకోనున్నారు. 7 క్లాస్ నుంచి 11 క్లాస్ విద్యార్ధులకు ఇకపై టీచర్లు చెప్పే రెగ్యులర్ పాఠాలే కాకుండా యూట్యూబ్ చూస్తూ పాఠాలు వినొచ్చు. 

తెలంగాణ విద్యాశాఖ యూట్యూబ్ పాఠాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ‘ఇంజినీరింగ్‌ విద్య – భవిష్యత్తు ప్రణాళిక’ అనే అంశంపై బుధవారం (ఫిబ్రవరి 26,2020)న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ ఈ విషయాన్ని తెలిపారు.  మూడునెలల్లో 7-11 తరగతుల వరకు యూట్యూబ్‌ పాఠాలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. దీని కోసం ఓ యూట్యబ్ చానల్ ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. 

స్కూల్స్ కు డుమ్మా కొట్టే విద్యార్ధులు..అనారోగ్యంతో స్కూల్ కు వెళ్లలేని విద్యార్ధులు ఇకపై స్కూల్ కు వెళ్లలేదు..పాఠాలు వినలేదు..ఎగ్జామ్స్ ఎలా రాయాలి? అని ఇకపై విద్యార్ధులు బాధపడనక్కలేదు. స్కూల్ కు వెళ్లకపోయినా యూట్యూబ్ ద్వారా స్కూల్లో టీచర్లు చెప్పే పాఠాల్ని ఈ యూట్యూబ్ చానల్ లో అందుబాటుకొస్తాయి.

7-11 తరగతుల  విద్యార్ధులకు అంటూ స్కూల్ నుంచి ఇంటర్ వరకూ పాఠాలన్నీ ఈ యూట్యూబ్ చానల్ లో అందుబాటు ఉంటాయి. విద్యార్ధులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే ఈ యూట్యూబ్ చానల్ కు అధికారులు మరో మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు. అంటే వచ్చే విద్యాసంవత్సరం  (20202-21) నుంచి ఈ విధానం అందుబాటులోకి రానుంది. 

Read More>>రాష్ట్ర బీజేపీకి దూరంగా ఆ ముగ్గురు ఎంపీలు!