బస్ భవన్ వద్ద ఉద్రిక్తత : ప్రగతి భవన్ ముట్టడిస్తాం – లక్ష్మణ్

  • Published By: madhu ,Published On : October 12, 2019 / 06:52 AM IST
బస్ భవన్ వద్ద ఉద్రిక్తత : ప్రగతి భవన్ ముట్టడిస్తాం – లక్ష్మణ్

Updated On : October 12, 2019 / 6:52 AM IST

ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు బీజేపీ మద్దతిస్తోందని, ప్రత్యక్ష రంగంలోకి దిగినట్లు, ప్రభుత్వంతో తాడోపేడో తెల్చుకుంటామన్నారు బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ఆర్టీసీ కార్మికులతో కలిసి బస్ భవన్ వద్ద ఆందోళన చేపట్టింది బీజేపీ. ధర్నాలో బీజేపీ నేతలు, ఆర్టీసీ కార్మికులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10tvతో లక్ష్మణ్ మాట్లాడారు. ప్రభుత్వం స్పందించకపోతే..ప్రగతి భవన్‌ ముట్టిస్తామని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్..ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటున్నారు ఆర్టీసీ కార్మికులు. గతంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అక్టోబర్ 05వ తేదీ నుంచి కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. దశల వారీగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అందులో భాగంగా అక్టోబర్ 12వ తేదీ శనివారం బస్ భవన్ వద్ద పెద్ద ఎత్తున్న ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించారు. వీరికి పలు పార్టీలు మద్దతిచ్చాయి. బస్ భవన్ పైకి కార్మికులు, నేతలు ఎక్కడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా..పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. 

మరోవైపు డిపోల ఎదుట కార్మికులు మౌన దీక్ష చేపట్టారు. ఆర్టీసీ ఉద్యోగులు బర్తరఫ్ అయినట్లుగా ప్రకటించి..వారి స్థానంలో కొత్త వారిని నియమించడం అప్రజాస్వామికమని కార్మికులు వెల్లడించారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు ఒక్క మాటతో 50 వేల మందిని డిస్మిస్ చేశామని అన్నారు..తామే ప్రభుత్వాన్ని డిస్మిస్ చేస్తున్నామన్నారు. రూ. 50 వేల జీతాలు అంటున్నారు..రూ. 20 వేల జీతం ఉన్నట్లు చూపిస్తారా ? అంటూ సవాల్ విసిరారు. దీనికి సంబంధించిన ప్లే స్లిప్పులను మీడియాకు చూపించారు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. పక్క రాష్ట్రంలో ప్రభుత్వం చేసినట్లు..ఇక్కడ కూడా చేయాలన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. 
Read More : హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు