హజ్ యాత్రకు బయల్దేరిన తెలుగు రాష్ట్రాల 70మంది బృందం

హజ్ యాత్రకు బయల్దేరిన తెలుగు రాష్ట్రాల 70మంది బృందం

Updated On : October 28, 2019 / 5:11 AM IST

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 70 మంది యాత్రికుల బృందం పవిత్ర ఉమ్రా యాత్రకు బయలుదేరింది. శంషాబాద్ విమానాశ్రయంలో మహ్మద్ యూసుఫ్ అలీ వీడ్కోలు తెలిపారు. 16 రోజుల పర్యటన ముగించుకుని నవంబర్ 11న తిరిగి హైదరాబాద్ చేరుకోనుంది.

తెలంగాణ అల్ మిజాన్ హజ్ ఓ ఉమ్రా సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 70 మంది అక్టోబరు 28 ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఉమ్రా యాత్రకు బయలుదేరారు. ఈ బృందంలో 4 నెలల పసికందు నుండి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు. 16 రోజుల పాటు సౌదీ అరేబియాలో పవిత్ర ప్రాంతమైన మక్కా, మదీనాలతో పాటు పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకోనున్నారు. యాత్రికుల బృందాన్ని అల్ మిజాన్ హజ్ ఓ ఉమ్రా తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ అల్ హజ్ హఫేజ్ మహమ్మద్ ఫయాజ్ అలీ వెంట తీసుకునివెళ్లారు. 

డైరక్టర్ ఫయాజ్ అలీ ఈ యాత్రలో ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. పుణ్యక్షేత్రాలను దర్శించునే అసక్తి గలిగిన వారు తమను సంప్రదించాలని అన్నారు నవంబర్ 30 మరో గ్రూప్ సభ్యులను తీసుకెళ్ళడం జరుగుతుందని తెలిపారు.