ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసి షాక్ : అక్టోబర్ 5నుంచి సమ్మె సైరన్

  • Published By: chvmurthy ,Published On : September 29, 2019 / 10:16 AM IST
ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసి షాక్ : అక్టోబర్ 5నుంచి సమ్మె సైరన్

Updated On : September 29, 2019 / 10:16 AM IST

తెలంగాణ రాష్ట్రంలో అక్టోబరు 5 నుంచి సమ్మె చేయాలని ఆర్టీసి కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో సహా 25 డిమాండ్లను కార్మిక సంఘాలు యాజమాన్యం ముందు ఉంచాయి.వీటిపై ఇంత వరకు ఎటువంటి స్పందన రాకపోవటంతో సమ్మెచేయాల్సి వస్తోందని కార్మిక సంఘాలు చెపుతున్నాయి.  కార్మికుల సమ్మెకు ప్రయాణికులు మద్దతు ఇచ్చి సహకరించాలని కార్మిక సంఘాలు కోరాయి.

టీఎంయూ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు సమ్మె చేపట్టనున్నాయి. ఐదో తేదీ మొదటి డ్యూటీ నుంచే సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసుకున్న సంఘాలు చివరికి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నాయి.  గుర్తింపు పొందిన సంఘంతో సహా 25 సంఘాలు యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చి నెల రోజలు దాటుతున్నా ప్రభుత్వం నుంచి కానీ, లేబర్ కమీషనర్ నుంచి కానీ ఆర్టీసీ నుంచి కానీ  ఎలాంటి స్పందనా  లేకపోవడంతో కార్మికులు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

సమ్మె నోటీసులిచ్చినా, యాజమాన్యం చర్చలకు ఆహ్వానించకపోవడంతో కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ కార్మకుల  న్యాయమైన కోర్కెలు తీర్చాలని వారు కోరుతున్నారు. ఆర్టీసీని మూత వేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.