వివాహేతర సంబంధం : భర్తకు బడితె పూజ

  • Published By: madhu ,Published On : September 14, 2019 / 08:43 AM IST
వివాహేతర సంబంధం : భర్తకు బడితె పూజ

Updated On : September 14, 2019 / 8:43 AM IST

భర్తకు ఓ భార్య బడితెపూజ చేసింది. తాను ఉండగానే..మరొక మహిళతో ఉండడంతో ఆమె కోపం కట్టలు తెచ్చుకుంది. నడిరోడ్డుపై లాక్కొచి చితక్కొట్టింది. ఈ ఘటన నగర శివారు ప్రాంతమైన అల్వాల్‌లో చోటు చేసుకుంది. 

వివరాల్లొకి వెళితే…సికింద్రాబాద్‌కు చెందిన గోపాల్‌ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి ఎంజల్‌తో 7 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు  ఉన్నారు. వీరు సుభాష్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. కొంత కాలంగా భార్యను, పిల్లలను వదిలి వేసిన గోపాల్‌ మరో యువతితో ప్రేమయాణం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం ఎంజల్ తెలుసుకుంది. తనను, పిల్లలను పట్టించుకోని భర్తకు గట్టిగా బుద్ధి చెప్పాలని అనుకుంది. 

సెప్టెంబర్ 14వ తేదీన గోపాల్ ఉంటున్న నివాసం వద్దకు ఎంజల్ వచ్చింది. ఇంట్లో ఏకాంతంలో ఉన్న ఇద్దరిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదింది. భర్తకు బడితె పూజ చేసింది. రోడ్డుపైకి లాక్కొచ్చి కొట్టింది. భర్తతో పాటు ఉన్న మహిళను సైతం బంధువులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఇద్దరు పిల్లలను.. తమను పట్టించుకోకుండా తిరుగుతున్నాడని ఆ మహిళ వాపోయింది.