తమిళనాడు రాజకీయాల్లో మన్నర్‌గుడి మాఫియా.. శశికళ బలం అదే?

తమిళనాడు రాజకీయాల్లో మన్నర్‌గుడి మాఫియా.. శశికళ బలం అదే?

Updated On : February 10, 2021 / 12:50 PM IST

SASIKALA: అన్నాడీఎంకే పార్టీని తన అధీనంలోకి తెచ్చుకుంటానని చిన్నమ్మ శశికళ వ్యాఖ్యానించారు. క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెడతానని, అన్నాడీఎంకేను తన కంట్రోల్లోకి తెచ్చుకుంటానని, ఎవరూ తనను అడ్డుకోలేరంటున్న బహిష్కృత నేత శశికళ.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన శశికళ.. మాజీ సీఎం జయలలితకు మధ్య రిలేషన్ ఏంటి.. జైలుకు వెళ్లడానికి ముందు ఏం జరిగింది..

తమిళనాడు రాజకీయాల్లో మన్నర్‌గుడి మాఫియా
జయలలిత చనిపోగానే.. శశికళ ఆమె కుటుంబం మొత్తం వార్తల్లోకి వచ్చేసింది. నిదానంగా చిరకాల స్నేహితురాలు తమిళనాడు మాజీ సీఎం జయలలితను అనుసరిస్తూ.. చిన్నమ్మ అయిపోయింది. తమిళనాడుకు తర్వాతి సీఎం అయ్యేందుకు ప్లాన్ చేసుకున్న ఆమెపై విమర్శలు గుప్పిస్తూ.. మన్నరగుడి మాఫియా గ్రూప్ అనే పేరు చెప్పి అవాంతరాలు క్రియేట్ చేశారు.

మన్నర్‌గుడి మాఫియా అంటే..
కావేరి డెల్టాలోని తిరువరూర్ జిల్లాలోని చిన్నగ్రామం నుంచి వచ్చారు శశికళ నటరాజన్. జయలలితపై ప్రభావం చూపించే కొంతమంది వ్యక్తుల్లోని చిన్నమ్మ బంధువులే మన్నర్ గుడి మాఫియా.

వాళ్లకు అందిన లాభాలేంటి
జయ టీవీ హెడ్ అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ నుంచి శశికళ ఆమె బృందమంతా అన్ని రోల్స్ లో నిండిపోయారు. అంతేకాకుండా మన్నర్‌గుడి మాఫియా ప్రభుత్వంలోని కీలక పదవులను చేజిక్కించేసుకుంది. జయలలిత నమ్మకాన్ని అడ్డుకుపెట్టుకుని పూర్తిగా వాడేసుకున్నారు.

శశికళ నుంచి చిన్నమ్మగా:
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఎమ్ నటరాజన్ అనే వ్యక్తిని శశికళ పెళ్లాడారు. దాంతో పాటు ఆమెకు వీడియో రికార్డింగ్ కంపెనీ కూడా ఉండేది. దాంతోనే జయలలితకు దగ్గరై ఏడీఎమ్కే పార్టీ ఫంక్షన్లకు పనిచేసేవారు. వీడియో క్యాసెట్లు ఇచ్చే వంకతో పోస్ గార్డెన్ లోని జయ ఇంటికి వెళ్లి ఎక్కువగా కలుస్తుండేవారు.

ఫ్రెండ్స్ నుంచి శత్రువులుగా:
1991లో జయలలిత ముఖ్యమంత్రి అయినప్పటికే శశికళ మకాం మార్చేసి సీఎం ఇంటికి వెళ్లిపోయింది. 2011లో శశికళ, ఆమె బంధువును పార్టీలో నుంచి తీసేయడమే కాకుండా పోయిస్ గార్డెన్ ఇంటి నుంచి గెంటేసింది. కొంతకాలానికి అక్రమాస్తుల కేసులో.. అరెస్టు బెంగళూరులోని ట్రయల్ కోర్టు చుట్టూ తిరిగారు. అదిఅలా ఉంచితే.. అపోలో హాస్పిటల్ లో శశికళ చివరిక్షణాల్లో ఆమె అక్కడే ఉంది.

V K Sasikala

V K Sasikala

శశికళ సోదరుడు దివాకరన్
శశికళ సోదరుడు వీ దివాకరన్ డెల్టా రీజియన్ లోనే పేరు కలవాడు. ఆల్ గర్ల్స్ సెంగామ్లా తయ్యార్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఉమెన్స్ కాలేజి నడిపిస్తుండేవాడు. మన్నర్‌గుడి సమీపంలోని సుందర్ కొట్టాయ్ లో ఉన్న STETకాలేజి ఎదురుగా.. భారీగా ఆస్తులు ఉన్నాయి. అదంతా చిన్నమ్మ దయేనట.

SASIKALA 2

SASIKALA 2

పవర్‌ఫుల్ కనెక్షన్స్
శశికళ సోదరుడు డా. వినోదగన్ కొడుకు టీవీ మహదేవన్ ట్రిచీ రీజియన్ లోనే చాలా పవర్ ఫుల్. ఆమె మేనల్లుడు వివేక్ కూడా తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేశాడు.