Manipur women video : మణిపూర్ ఘటనపై నివేదిక ఇవ్వండి : సుప్రీం చీఫ్ చంద్రచూడ్ ఆదేశం

మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్ లో ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ గురువారం ఆదేశించారు....

Manipur women video : మణిపూర్ ఘటనపై నివేదిక ఇవ్వండి : సుప్రీం చీఫ్ చంద్రచూడ్ ఆదేశం

CJI Chandrachud

Updated On : July 20, 2023 / 12:14 PM IST

Manipur women video : మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్ లో ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ గురువారం ఆదేశించారు. తాను ఈ ఘటనపై తీవ్రంగా కలత చెందానని, ఈ ఘటన రాజ్యాంగ వైఫల్యమని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. (CJI Chandrachud condemns)

Manipur Incident : మణిపూర్ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ

‘‘మణిపూర్ వీడియో పట్ల నేను తీవ్రంగా కలత చెందాను. దీనిపై నా తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాను. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది ఆమోదయోగ్యం కాదు’’ అని చంద్రచూడ్ అన్నారు. (Manipur women video) నిందితులపై కేసు నమోదు చేసేందుకు తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Heavy rains : తెలంగాణలో 3 రోజులుగా కురుస్తున్న భారీవర్షాలు… విద్యాసంస్థలకు సెలవులు

మణిపూర్ హింసాకాండలో మహిళలను ఉపయోగించడం రాజ్యాంగంలో ఆమోదయోగ్యం కాదని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. మణిపూర్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం, ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నివేదికలను డిమాండ్ చేశానని సుప్రీం చీఫ్ తెలిపారు. మణిపూర్ అంశంపై జూలై 28వతేదీన తాము విచారణ చేపడతామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు.