Manipur Incident : మణిపూర్ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.. దోషులను వదిలిపెట్టబోమని వార్నింగ్

మణిపూర్‌లో ఇద్దరు కుకీ మహిళల ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎట్టకేలకు గురువారం స్పందించారు. మణిపూర్‌లో ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన బుధవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తన హృదయం బాధతో నిండిపోయిందని మోదీ అన్నారు....

Manipur Incident : మణిపూర్ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.. దోషులను వదిలిపెట్టబోమని వార్నింగ్

PM Modi

Updated On : July 20, 2023 / 12:53 PM IST

Manipur Incident – PM Modi : మణిపూర్‌లో ఇద్దరు కుకీ మహిళల ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎట్టకేలకు గురువారం స్పందించారు. మణిపూర్‌లో ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన బుధవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తన హృదయం బాధతో నిండిపోయిందని మోదీ అన్నారు. మణిపూర్‌ కుమార్తెలకు జరిగిన దురాగతాన్ని ఎప్పటికీ క్షమించలేం. ఈ ఘటన దేశానికి సిగ్గుచేటని, దోషులను వదిలిపెట్టబోమని (Guilty Will Not Be Spared) పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. (Manipur Incident Shamed Country)

Heavy rains : తెలంగాణలో మూడు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలు

మణిపూర్‌లో ఘర్షణలు చెలరేగిన ఒక రోజు తర్వాత మే 4న ఈ ఘటన జరిగింది. (Manipur Incident) వీడియోలో ఇద్దరు మహిళలను ఒక గుంపు నగ్నంగా ఊరేగించి, వేధింపులకు గురి చేసి, పొలంలోకి లాగి, అక్కడ వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఈ నేరంపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని మణిపూర్ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

Maharashtra : రాయగడ్‌లో విరిగిపడిన కొండచరియలు.. నలుగురి మృతి, పలువురికి గాయాలు

మణిపూర్ హింసాకాండలో 120 మందికి పైగా మరణించారు. వేలాది మంది ఊళ్లు వదిలి వెళ్లి పోయారు. వేలాదిమంది సహాయ శిబిరాల్లో తల దాచుకున్నారు. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను మరింత పటిష్ఠం చేయాలని ప్రధాని మోదీ చెప్పారు. నేరస్తులను విడిచిపెట్టబోమని తాను దేశానికి హామీ ఇస్తున్నానని మోదీ పేర్కొన్నారు.