Maharashtra : రాయగడ్‌లో విరిగిపడిన కొండచరియలు…నలుగురి మృతి, పలువురికి గాయాలు

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో నలుగురు మరణించారు. విరిగిపడిన శిథిలాల్లో చాలా మంది చిక్కుకుపోయారని భయాందోళనలు చెందుతున్నారు....

Maharashtra : రాయగడ్‌లో విరిగిపడిన కొండచరియలు…నలుగురి మృతి, పలువురికి గాయాలు

Landslide In Raigad

Landslide In Maharashtra : మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో నలుగురు మరణించారు. విరిగిపడిన శిథిలాల్లో చాలా మంది చిక్కుకుపోయారని భయాందోళనలు చెందుతున్నారు. రాయగఢ్ జిల్లాలో నిన్న అర్థరాత్రి కొండచరియలు విరిగిపడటంతో 30 కుటుంబాలు చిక్కుకున్నాయి. (Landslide In Maharashtra Raigad) గిరిజన కుగ్రామానికి చెందిన పలు ఇళ్లు ఉన్న ఖలాపూర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇప్పటి వరకు 25 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా వారిలో నలుగురు మృతి చెందారు. మిగిలిన 21 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Amritpal Singhs wife : కిరణ్‌దీప్‌కు లుక్ అవుట్ నోటీసు…విమానాశ్రయంలో అడ్డుకున్న అధికారులు

జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్)కి చెందిన రెండు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు ముంబయి నుంచి మరో రెండు బృందాలు బయలుదేరాయి. ప్రస్తుతం 100 మంది పోలీసులు, జిల్లా అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయ్‌గఢ్ జిల్లాలోని ఆరు ప్రధాన నదుల్లో సావిత్రి, పాతాళగనగ ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.

New Zealand : న్యూజిలాండ్‌లో కాల్పులు, ఇద్దరి మృతి..షూటర్ హతం

కుండలికా, అంబా నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. గాధి, ఉల్లాస్ నదులు డేంజర్ మార్కుకు దగ్గరగా ప్రవహిస్తున్నాయని జిల్లా యంత్రాంగం తెలిపింది. ముంబయి, రాయ్‌గఢ్, పాల్ఘార్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముంబయిలో ఐదు బృందాలు, పాల్ఘర్, రాయ్‌గఢ్, రత్నగిరి, కొల్హాపూర్, సాంగ్లీ, నాగ్‌పూర్, థానేలో ఒక్కొక్క టీమ్‌ను ఎన్డీఆర్ఎఫ్ మోహరించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబయిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు.