Coromandel Express derails : బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం, 30 మంది మృతి
Coromandel Express derails : ఈ దుర్ఘటనలో 30 మంది ప్రయాణికులు మరణించగా, మరో 179 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Coromandel Express
Coromandel Express derails: ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఘోర ప్రమాదానికి గురైంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు.. గూడ్స్ రైలును ఢీకొన్న దుర్ఘటనలో ఏడు బోగీలు పట్టాలు తప్పి, బోల్తా పడ్డాయి. ఈ దుర్ఘటనలో 30 మంది ప్రయాణికులు మరణించగా, మరో 179 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
(Coromandel Express collides) పలువురు ప్రయాణికులు బోగీల కింద ఉన్నారని వారిని బయటకు తీస్తున్నామని ఎమర్జెన్సీ అధికారులు చెప్పారు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా అధికారులను అప్రమత్తం చేశారు. సహాయ కార్యక్రమాలు చేపట్టాలని చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు.